ఆదివారం, ఆగస్టు 09, 2020

ఆనాటి హృదయాల...

అన్నదమ్ముల అనుబంధం చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ ముగ్గురు పిల్లలు పెద్దయ్యి రామారావు, బాలకృష్ణ, మురళీ మోహన్ లు అయ్యాక వచ్చే పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : అన్నదమ్ముల అనుబంధం (1975)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : సినారె
గానం : బాలు
 
ఆనాటి హృదయాల 
ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల 
విరిసే వసంతం అదేలే అదేలే
 
ఆనాటి హృదయాల 
ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల 
విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన 
పలికేను ఏనాటికైనా 
 
ఆనాటి హృదయాల 
ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల 
విరిసే వసంతం అదేలే అదేలే
 
ఏటేటా మన ఇంట 
ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం 
శ్రీ నిలయమై నిలవాలి
 
ఏటేటా మన ఇంట 
ఈ పండగే జరగాలి
ఈ నిలయం కలకాలం 
శ్రీ నిలయమై నిలవాలి
వెలుతురైనా చీకటైనా 
విడిపోదు ఈ అనుబంధం
 
ఆనాటి హృదయాల 
ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల 
విరిసే వసంతం అదేలే అదేలే
 
తారకలే దిగివచ్చి 
తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో 
వేణువులై పాడాలి
 
తారకలే దిగివచ్చి 
తారంగం ఆడాలి
వెన్నెలలే ముంగిటిలో 
వేణువులై పాడాలి
ఆటలాగా పాటలాగా 
సాగాలి మన జీవితం
 
ఆనాటి హృదయాల 
ఆనందగీతం ఇదేలే ఇదేలే
ఈనాడు నయనాల 
విరిసే వసంతం అదేలే అదేలే
ఆ పాట అధరాలపైన 
పలికేను ఏనాటికైనా 

 

2 comments:

యెవ్వర్ గ్రీన్ సాంగ్..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.