స్నేహితుల దినోత్సవం సందర్బంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు తెలుపుతూ "నీస్నేహం" చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నీస్నేహం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : ఆర్.పి.పట్నాయక్, రాజేశ్
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
బొమ్మా బొరుసులేని నాణానికి విలువుంటుందా
మనమిద్దరమూ పుట్టుండకపోతే చెలిమికి విలువుందా
సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా
మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా
గలగలమని సిరిమువ్వగా కలతెరగని చిరునవ్వుగా
నా ఎదలయలే తన మధురిమలై పాడాలీ నీ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
వివరిస్తున్నది అద్దం మన అనుబంధానికి అర్ధం
నువ్వు నాలాగా నేన్నీలాగా కనిపించడమే సత్యం
నువ్వు చూసే ప్రతి స్వప్నం నా రాతిరి దారికి దీపం
నీ కల నిజమై కనిపించనిదే నిదరించనురా నేస్తం
గెలుపును తరిమే ఆటగా నిలవని పరుగులు తీయగా
మన ప్రాణాలే తన పాదాలై సాగాలీ ఈ స్నేహం
కొంతకాలం కిందట బ్రహ్మ దేవుని ముంగిట
రెండు ఆత్మలు కోరుకున్నవి ఓ వరం
రూపు రేఖలు వేరట ఊపిరొకటే చాలట
ఆ వరాన్నే స్నేహమంటున్నాం మనం
కంటిపాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా
నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి
స్నేహమంటే రూపులేని ఊహకాదని లోకమంతా
నిన్ను నన్నూ చూడగానే నమ్మితీరాలి
2 comments:
హాపీ ఫ్రెండ్ షిప్ డే అండీ..
థ్యాంక్స్ శాంతి గారు.. మీకు కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.