గురువారం, ఆగస్టు 20, 2020

గ్రీకువీరుడు...

నిన్నే పెళ్ళాడతా చిత్రంలోని ఒక హుషారైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : నిన్నేపెళ్లాడతా (1996)
సంగీతం : సందీప్‌చౌతా
సాహిత్యం : సిరివెన్నెల  
గానం : సౌమ్య

గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు నా రాకుమారుడు 
కలల్లోనే ఇంకా ఉన్నాడు
ఫిలింస్టారులు క్రికెట్టు వీరులు 
కళ్లుకుట్టి చూసే కుర్రాడు 
డ్రీమ్‌బాయ్
రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు 
డ్రీమ్‌బాయ్
ఊరని పేరని జాడనే చెప్పడు
ఏమి చెప్పను ఎలాగ చెప్పను 
ఎంత గొప్పవాడే నా వాడు
రెప్పమూసినా ఎటేపు చూసినా 
కళ్లముందు వాడే ఉన్నాడు
ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...

నడకలోని ఠీవి చూసి సింహమైన చిన్నబోదా
నవ్వులోని తీరుచూసి చల్లగాలి కరిగిపోదా
స్టైల్‌లో వాడంత వాడు లేడు
నన్ను కోరిన మగాళ్లు ఎవ్వరు 
నాకు నచ్చలేదే వాట్ టు డూ
నేను కోరిన ఏకైక పురుషుడు 
ఇక్కడే ఎక్కడో ఉన్నాడు

ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎందుకో ఆకలి నిద్దరా ఉండనే ఉండదే
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...

లోకమంతా ఏకమైనా లెక్కచేయనన్న వాడు
కోరుకున్న ఆడపిల్ల కళ్లముందు నిలవలేడు
చూస్తా ఎన్నాళ్లు దాగుతాడు
కన్నె ఊహలో ఉయ్యాలలూగుతూ 
ఎంత అల్లరైనా చేస్తాడు
ఉన్నపాటుగా కొరుక్కు తిననుగా 
ఎందుకంత దూరం ఉంటాడు

ఎంతో ఆశగా ఉందిలే కలుసుకోవాలని
ఎవ్వరో వాడితో చెప్పరే ఎదురుగా రమ్మని
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
గ్రీకువీరుడు... గ్రీకువీరుడు...
 
 

2 comments:

భలే బావుంటుందీ పాట..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.