శుక్రవారం, ఆగస్టు 07, 2020

ఇంటి పేరు అనురాగం...

మగధీరుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట సినిమాలో రెండు సార్లు వస్తుంది ఒకటి మెలొడీ కాగా మరొకటి డిస్కో మ్యూజిక్ నేపధ్యంతో వస్తుంది. అందుకే సాహిత్యంలో నాలుగు చరణాలు ఉన్నాయి మొదటి రెండు మొదటి పాటవి తర్వాత చరణాలు రెండో పాటలోనివి. రెండో పాట వీడియో ఇక్కడ చూడవచ్చు. ఎంబెడ్ చేసిన మెలోడీ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. 


చిత్రం : మగధీరుడు (2002)
సంగీతం : బాలు    
సాహిత్యం : వేటూరి   
గానం : బాలు   

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం

వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
వెలుగునీడలయినా, కలిమిలేములయినా
మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముగ్గులే
ఎదిరించని జానకి, నిదురించని ఊర్మిళ
తోడికోడళ్ళుగా ఇల్లు చక్కదిద్దగా
ప్రేమకు రూపాలుగా రామలక్ష్మణులుగా
కొండంత అండగా అన్నలు తోడుండగా

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

వయసులో చిన్నయినా మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
వయసులో చిన్నయినా మనసులో పెద్దగా
తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా
అమ్మగా నాన్నగా బిడ్డగా పాపగా
ఏ దేవకి కన్నా ఏ యశోద పెంచినా
గోకులాన వెలిసాడు గోపాలకృష్ణుడు
మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఏ కొండల పుట్టినా ఏ కోనలపొంగినా
సాగే ప్రతి జీవనదికి సాగరమే తుది మజిలి
సంసారమనే ఒక సాగరం
అన్నతమ్ములైనా ఆలుమగలకైనా 
ఈ బ్రతుకు ప్రయాగలో 
తప్పదులే సంగమం ఈ త్రివేణి సంగమం 

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం

వెలుగులోన నీడగా లేమిలోన కలిమిగా
అందరము ఒక్కటిగా కలిసినప్పుడు
ఎడబాటుల బాటలన్ని కూడలి కావా
ఎదచాటున ఆపేక్షలే పొంగి పొరలవా
మమకారం ఒక్కటే మానవతకు ఆధారం
ఈ సంగమాన్ని ఆపడం 
ఎవరి తరం..ఇంకెవ్వరి తరం

ఇంటి పేరు అనురాగం
ముద్దు పేరు మమకారం
మా ఇల్లే బృందావనం
మా ఇల్లే బృందావనం
ముక్కోటి దేవతలు 
వెలసిన దేవాలయం 
  
 

4 comments:

నైస్ సాంగ్..పిక్ చాలా యాప్ట్ గా ఉందండి..

థ్యాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ శాంతి గారు..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ సర్. మీ వ్యాఖ్యలు ఎప్పుడు చూసిన సాక్షాత్ వేటూరి వారే వచ్చి భుజంతట్టి ప్రోత్సహిస్తున్నట్లు అనిపిస్తుంటుంది. మెనీ థ్యాంక్స్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.