సంతోషం సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : సంతోషం (2002)
సంగీతం : ఆర్.పి.పట్నాయక్
సాహిత్యం : కులశేఖర్
గానం : శంకర్ మహదేవన్
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
అమ్మాయిల చేతలకీ కుర్రాళ్ల
కూతలకీ హద్దంటూ
లేదయ్యో ఈ దినం
సందట్లో సందయ్యో పెళ్లవనీ
జంటలకీ ఆనందం
అందించే ఈ క్షణం
పేకాట రాయళ్ల చేజోరు చూడాలి
ఈ పెళ్లి లోగిళ్లలో
మందేసి చిందేసి అల్లర్లు చేసేరు
కుర్రాళ్లు విడిదింటిలో
కన్నెపిల్లలకు బ్రహ్మచారులకు
కొంటెసైగలే ఇష్టమంట
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
ఈ పెళ్లిపందిరిలో సరదాల సందడిలో
ఈ నేలకొచ్చిందయ్యో అంబరం
ఈ ఊరు వాడంతా పొంగిపోయేలాగా
ఈ ఇంట జరగాలయ్యో సంబరం
వేవేల జన్మాల పుణ్యాల ఫలితాలు
చేరేది ఈ వేళలో
అక్షింతలే నేడు లక్షింతలయ్యాయి
ఈ వేదమంత్రాలలో
కన్యదాతకి అప్పగింతలూ
కంటితుడుపులూ తప్పవంట
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
గుప్పెడంత గుండెల్లో
చెప్పలేని ఆనందం
ఈ క్షణాలే ఎంతో సంతోషం
జీవితం చిరునవ్వుతో
గడిపేయడమే కదా ఆనందం
అందరం మనమందరం
కలిసుంటేనే కదా సంతోషం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి న క్తిక్తోం
ధీం ధినక్‌తరి నక్తిక్‌నక్తిక్‌తోం
2 comments:
సున్నితమైన పాట..
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.