శనివారం, ఆగస్టు 22, 2020

చాంగుభళా చాంగుభళా...

వినాయక చవితి సందర్భంగా మిత్రులందరకూ శుభాకాంక్షలు. ఓ బేబీ సినిమాలోని ఈ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : ఓ బేబి (2019)
సంగీతం : మిక్కీ జె మేయర్ 
సాహిత్యం : భాస్కరభట్ల 
గానం : నూతన మోహన్ 

With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift Your Hands To The Sky
And Say Ganesha

He's Your Friend When You Need
He's The Magic In Your Beat 
Lift Your Hands To The Sky
And Say Ganesha

నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నా సందేహం లోనా
నా ఎండమావి దారుల్లో నవ్వులు పూసే
నా రెండు కళ్ల వీధుల్లో వెన్నెల కాసే
నా గుండె చూడు తొలిసారి గంతులు వేసే
ఆ నిన్నల్లో మొన్నల్లో కలలన్నీ సడిచేసే

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా
తిరిగి వచ్చే నిజంగా

నేనే నేనా వేరే ఎవరోనా
నేనే ఉన్నా సందేహం లోనా

ఇంత గొప్పగుంటుందా జీవితం?
ఇంద్రధనసు మెరిసినట్టుగా
తిరిగి వచ్చి చేరుకుంటే నా గతం
తెలుసుకుంటోంది మనసేమో మెల్లమెల్లగా
ఊహలన్నీ కిలకిలమంటూ
ఎగురుతున్నాయి సంకెళ్లు తెగినట్టుగా
గుండెపాట గొంతుని దాటి పెదవుల తీగలపై
మోగెనుగా ఎన్నెన్నో స్వరాలుగా

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా
తిరిగి వచ్చే నిజంగా

లోకమంత కొత్తకొత్తగుందిగా
పూల చెట్టు దులిపినట్టుగా
ఈ క్షణాల్ని పట్టుకుంట గట్టిగా
తల్లి వెళుతుంటే ఆపేసే పసిపాపలా
తీరిపోని సరదాలన్నీ
తనివి తీరేలా తీర్చేసుకోవాలికా
ఆశలన్నీ దోసిట నింపి 
సీతాకోకలుగా వదిలేస్తే
ఆనందం వేరు కదా

చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
చాంగుభళా చాంగుభళా చాంగుభళా ఇలాగా
నేను ఎలా మారిపోయా చెంగుమని భలేగా
యవ్వనమే తుర్రుమనీ పారిపోయే తూనీగా
తిరిగి వచ్చే నిజంగా

With The Rhythm In Your Feet
And The Music In The Soul
Lift Your Hands To The Sky
And Say Ganesha

He's Your Friend When You Need
He's The Magic In Your Beat 
Lift Your Hands To The Sky
And Say Ganesha 
 

2 comments:

సూపర్ సాంగ్..మీకూ, మీ కుటుంబ సభ్యులకీ హాపీ వినాయక చవితి అండి..

థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు. మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.