బుధవారం, ఆగస్టు 05, 2020

బేబీ హీ లవ్స్ యూ...

ఆర్య టు చిత్రంలోని ఒక అందమైన పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : ఆర్య 2 (2009)
సంగీతం : దేవీశ్రీప్రసాద్   
సాహిత్యం : చంద్రబోస్  
గానం : దేవీశ్రీప్రసాద్   

ఛ... వాడికి నా మీద ప్రేమే లేదు 
హి డసంట్ లవ్ మి యు నో.
నో. హి లవ్స్ యు. 
హి లవ్స్ యు సో మచ్.
అవునా. ఎంత?
ఊ.ఎంతంటే...

మొదటి సారి నువ్వు నన్ను చూసినప్పుడు 
కలిగినట్టి కోపమంత
మొదటి సారి నేను మాట్లాడినప్పుడు 
పెరిగినట్టి ద్వేషమంత
మొదటి సారి నీకు ముదుపెట్టినప్పుడు 
జరిగినంత దోషమంత
చివరిసారి నీకు నిజం చెప్పినపుడు 
తీరినట్టి భారమంత

ఓ. ఇంకా.

హో.తెల్ల తెల్లవారి పల్లెటూరిలోన 
అల్లుకున్న వెలుగంత
పిల్ల లేగదూడ నోటికంటుకున్న 
ఆవు పాల నురగంత
హో.చల్ల బువ్వలోన నంజుకుంటు 
తిన్న ఆవకాయ కారమంత
పెళ్లి ఈడుకొచ్చి తుళ్ళి ఆడుతున్న 
ఆడపిల్ల కోరికంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...

హే.అందమైన నీ కాలి కింద తిరిగే 
నేలకున్న బరువంత
నీలి నీలి నీ కళ్ళలోన మెరిసే 
నింగికున్న వయసంత
చల్లనైన నీ శ్వాసలోన తోణికే 
గాలికున్న గతమంతా
చుర్రుమన్న నీ చూపులోన 
ఎగసే నిప్పులాంటి నిజమంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...

హాయ్.పంటచేలలోని జీవమంత
ఘంటసాల పాట భావమంత
పండగొచ్చినా పబ్బమోచ్చినా 
వంటశాలలోని వాసనంత
కుంభకర్ణుడి నిద్దరంత
ఆంజనేయుడి ఆయువంత
కృష్ణ మూర్తిలో లీలలంత.
రామలాలి అంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...

పచ్చి వేప పుల్ల చేదు అంత
రచ్చబండ పైన వాదనంత
అర్ధమైన కాకపోయినా 
భక్తికొద్ది విన్న వేదమంత

ఏటి నీటిలోని జాబిలంత
ఏట ఏట వచ్చే జాతరంత
ఏకపాత్రలో నాటకాలలో 
నాటు గోలలంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...

అల్లరెక్కువైతే కన్నతల్లి వేసే 
మొట్టికాయ చనువంత
జల్లుపడ్డ వేళ పొంగి పొంగి పూసే 
మట్టిపూల విలువంత
హో.బిక్కు బిక్కు మంటు పరీక్ష రాసే 
పిల్లగాడి బెదురంత
లక్షమందినైన సవాలు చేసే 
ఆటగాడి పొగరంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...

ఎంత దగ్గరైన నీకు నాకు మధ్య ఉన్న 
అంతులేని దూరమంత
ఎంత చేరువైన నువ్వు నేను కలిసి 
చేరలేని తీరమంత
ఎంత ఓర్చుకున నువ్వు నాకు చేసే 
జ్ఞాపకాల గాయమంత
ఎంత గాయమైన హాయిగానే మార్చే 
మా తీపి స్నేహమంత

బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్...
బేబీ హి లవ్స్ యు.. హి లవ్స్ యు 
హి లవ్స్ యు సో మచ్... 

 

2 comments:

యెన్ని సార్లు చూసినా నచ్చే పాట..

థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ.. అవునండీ నాకు కూడా చాలా ఇష్టమైన పాట ఇది..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.