తమ్ముడు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : తమ్ముడు (1999)
సంగీతం : రమణగోగుల
సాహిత్యం : చంద్రబోస్
గానం : బాలు
కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
గల గల కళకళలు కిలకిలలు
కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
రాముడికి జానకికి పెళ్లి కుదిరినది
ఈ సందడికి విందులకి
ఇల్లు మురిసినది
నమ్మలేని లోకం నుంచి
మహాలక్ష్మిలాగా
అమ్మలేని మా ఇంట్లోకి
వదినమ్మ రాకా
ఎన్నడైన తన వెనకాలే
ఉంటాను కనకా
అన్నగారు తననేమన్నా
ఊరుకోను ఇంకా
నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి
అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
మెట్టినింటి దీపం నీతో
వెలగాలి మళ్లీ
కూతురంటి రూపం నీదే
నా చిట్టితల్లి
ఆశలన్నీ అక్షింతలుగా
జరగాలి పెళ్లి
అందమైన జంటను చూసి
మురవాలి తాళి
విడిది నేను ఇస్తానంటూ
తపించాలి నింగిన జాబిలి
కళకళలు కిలకిలలు
కొత్తగ చేరెను మా ఎదగూటికి
వెలుతురులు వెన్నెలలు
ఎదురుగా నిలిచెను మా కన్నులకి
2 comments:
బ్యూటిఫుల్ సాంగ్..
థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ శాంతి గారు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.