ఆదివారం, డిసెంబర్ 01, 2019

సామజవర గమనా...

ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక అందమైన అచ్చ తెలుగు పాటతో ఈ నెల కొత్తపాటల సిరీస్ ను మొదలు పెడదాం. సిరివెన్నెల గారి సాహిత్యానికి సిద్ శ్రీరామ్ నూరుశాతం న్యాయం చేయలేకపోయినా తన ఉచ్ఛారణ దోషాలను సులువుగా క్షమించేయగల సంగీత సాహిత్యాలు ఈ పాట సొంతం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల వైకుంఠపురములో (2019)
సంగీతం : ఎస్.ఎస్.థమన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : సిధ్ శ్రీరామ్

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు


నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి ఉయ్యాలలూగుతు
ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవటే
నిష్టూరపు విలవిలలూ

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

మల్లెల మాసమా
మంజుల హాసమా
ప్రతి మలుపులోన
ఎదురు పడిన
వన్నెల వనమా

విరిసిన పింఛమా
విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నెచిన్నెలంటె
ఎన్నగ వశమా

అరె నా గాలే తగిలినా
నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా

ఎంతో బ్రతిమాలినా
ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన
మనవిని వినుమా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్ప తగునా

నీ కాళ్ళని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చుపులనల్లా తొక్కుకు
వెళ్లకు దయలేదా అసలు

నీ కళ్ళకి కావలి కాస్తాయే
కాటుకల నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగ కంది చిందేనే సెగలూ
  

2 comments:

సో డెలికేట్ సాంగ్ బికాజ్ ఆఫ్ సిద్ శ్రీరాం వాయస్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.