మంగళవారం, డిసెంబర్ 24, 2019

తిరుప్పావై 9 తూమణిమాడత్తు...

ధనుర్మాసం లోని తొమ్మిదవ రోజు పాశురము "తూమణి మాడత్తు". ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : గోదా గీత మాలిక
సంగీతం : రాధా గోపి
సాహిత్యం : శ్రీమాన్ ఎస్.ఎన్.సి.పార్థసారధి అయ్యంగార్
గానం : వాణీజయరాం 

 
మంచి మాణిక్య
ఖచితమౌ మందిరానా
ధూప దీపాల దీప్తి
మాధుర్య మొసంగా
పట్టుపాన్పున నిద్రించు వదినా
లెమ్ము అక్కా మీరైన లేపరా

ఆమె మూగదా చెవిటిదా అలసెనా
తంత్ర గాని వశము చెందెనా


మేమంతా వాసుదేవు
వివిధ నామముల్ ముడువంగా రారాదా
వివిధ నామముల ముడువంగా రారాదా
వివిధ నామముల ముడువంగా రారాదా
 

    
~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ ముప్పై రోజుల తమిళ పాశురములను తెలుగు స్క్రిప్ట్ లో అందమైన బాపు గారి బొమ్మలతో కూర్చి చక్కని వ్యాఖ్యానం చేర్చి తెలుగు వన్ వారు అందిస్తున్నారు. వాటిలో నేటి తొమ్మిదవ పాశురం వీడియోను ఇక్కడ చూడవచ్చు. 
 

 
తూమణిమాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ,
తూపమ్ కమழ త్తుయిలణై మేల్ కణ్వళరుమ్,
మామాన్ మకళే ! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
మామీర్! అవళై యెழுప్పీరో, ఉన్ మగళ్ దాన్
ఊమైయో ? అన్ఱి చ్చెవిడో ?, అనన్దలో ?
ఏమ ప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో ?
మామాయన్ మాదవన్ వైగున్దన్ ఎన్ఱెన్ఱు,
నామమ్ పలవుమ్ నవిన్ఱేలో రెమ్బావాయ్ 


సూచన : తమిళ అక్షరం ’ழ’/'zha' ను తెలుగులోని ’ఱ’ ’ళ’ అక్షరాలను కలిపి పలికినట్లుగా పలుకవలెను. ఉదా : ழ = ళ, ழி = ళి, ழை = ళై, ழ் = ళ్, ழும்=ళుం

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఈ పాశురములను శ్రీ ఆచ్చి వేణుగోపాలచార్య గారు పాటలుగా మార్చి వ్రాయగా వి.డి.శ్రీకాంత్ సంగీతంలో నిత్యసంతోషిణి, గాయత్రి గానం చేశారు. నేటి తొమ్మిదవ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు.


ఆల్బం : తిరుప్పావై గీతగోపాలం
సంగీతం : వి.డి.శ్రీకాంత్
సాహిత్యం : ఆచ్చి వేణుగోపాలాచార్య
గానం : నిత్య సంతోషిణి, గాయత్రి


మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన
వలపులను పురికొల్పు గంధములు చల్లిన
పలు విధములైన దీపాల వెలుగున
పులకరించెను శయ్య పుష్ప సంపదలతో


మత్తుకొల్పెడి క్రొత్త మేడలో పడుకొన్నా
అత్త కూతురా వేగ లేచి ఇటు రావమ్మా
చిత్త శుద్దితో తలుపు శీఘ్రమే తీయమ్మా
పెత్తనం చాలించి మెత్తబడిపోవమ్మా

పుత్తడి మనసున్న పెద్ద అత్త గారు
మత్తొదిలి లేవనీ కూతురుని చూసేరు
చెవిటిదా గుడ్డిదా నీ బిడ్డ మూగదా
సేవలింకేమైనా చేసి అలసినదా


కదిలితే దండించు కాపరులు ఉన్నారా
కన్ను తెరవకుండా మంత్రించినారా
మాయావీ మాధవా వైకుంఠ వాసయని
మనసారా పిలవగా మగువ లేచిరమ్మా

మలినశూన్యములైన మణులెన్నో పొదిగిన
వలపులను పురికొల్పు గంధములు చల్లిన
పలు విధములైన దీపాల వెలుగున
పులకరించెను శయ్య పుష్ప సంపదలతో  


   

2 comments:

గోపీలోలా..గోపాలా..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.