బుధవారం, డిసెంబర్ 04, 2019

ఛోటి ఛోటి ఛోటీ బాతేఁ...

మహర్షి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : మహర్షి (2019)
సంగీతం : దేవీశ్రీప్రసాద్ 
సాహిత్యం : శ్రీమణి
గానం : దేవీశ్రీప్రసాద్

ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ

ఓ ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
ఓ మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ

ఓ పరిచయం ఎప్పుడూ
చిన్నదే(ఊ ఊఊ..)
ఈ చెలిమికే కాలమే
చాలదే(ఊ ఊఊ..)
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు
ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

ఛోటి చోటి చోటి చోటి చోటి చోటీ బాతేఁ
ఓ మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ

ఆట లాగ పాట లాగ
నేర్చుకుంటే రానిదంట
స్నేహమంటే ఏమిటంటే
పుస్తకాలు చెప్పలేని పాఠం అంట

కోరుకుంటే చేరదంట
వద్దు అంటే వెళ్ళదంట
నేస్తమంటే ఏమిటంటే
కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట

ఇస్తూ నీకై ప్రాణం
పంచిస్తూ తన అభిమానం
నీ ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటీ బాతేఁ
(ఛోటి ఛోటీ బాతేం బాతేఁ)
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
(మీఠి మీఠీ యాదేం యాదేఁ)

గుర్తులేవి లేని నాడు
బ్రతికినట్టు గుర్తురాదే
తియ్యనైన జ్ఞాపకాల్లా
గుండెలోన అచ్చయేవి సావాసాలే

బాధలేవీ లేని నాడు
నవ్వుకైనా విలువుండదే
కళ్ళలోన కన్నీళ్ళున్నా
పెదవుల్లో నవ్వు చేరగదే స్నేహం వల్లే

నీ కష్టం తనదనుకుంటూ
నీ కలనే తనదిగా కంటూ
నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ
(ఊ ఊఊ..)

ఎన్నో వేల కథలు
అరె ఇంకో కథ మొదలు

ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటి ఛోటీ బాతేఁ
(ఛోటి ఛోటీ బాతేం బాతేఁ)
మీఠి మీఠి మీఠి మీఠి మీఠి మీఠీ యాదేఁ
(మీఠి మీఠీ యాదేం యాదేఁ)


4 comments:

చొటీ/మీటీ కాదండి. ఛోటీ/మీఠీ

ఈ పాట టేకింగ్ చాలా బావుంది..

అవునండీ.. బావుంటుంది.. థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు :-)

థాంక్స్ అజ్ఞాత గారు.. నిన్న కాస్త బద్దకించానండీ.. ఇపుడు సరి చేశాను..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.