ఆదివారం, డిసెంబర్ 23, 2018

ఒక వేణువు వినిపించెను...

అమెరికా అమ్మాయి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : మైలవరపు గోపీ
గానం : జి.ఆనంద్

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..
ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
సిరివెన్నెల తెలబోయెను జవరాలి చూపులో..
నవమల్లిక చినబోయెనూ..
నవమల్లిక చినబోయెనూ చిరునవ్వు సొగసులో

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
వనరాణియే అలివేణికి సిగపూలు తురిమెనూ..
రేరాణియే నా రాణికీ.. 
రేరాణియే నా రాణికీ పారాణి పూసెనూ

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..

ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
ఏ నింగికి ప్రభవించెనో నీలాల తారకా
నా గుండెలో వెలిగించెనూ..
నా గుండెలో వెలిగించెనూ సింగార దీపికా

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా..
ఒక రాధిక అందించెను.. నవరాగ మాలికా..

ఒక వేణువు వినిపించెను..అనురాగ గీతికా

4 comments:

సున్నితమైన భావాలతో కూడిన అందమైన పాట. అసలా సినిమాయే ... ఇప్పటి సినిమా వాళ్ళ ఊతపదంలా కాకుండా ... ఒక “డిఫరెంట్” సినిమా, అందునా 1970ల్లో (ఇప్పటి సినిమావాళ్ళు ప్రతి సినిమా డిఫరెంట్ అనే చెప్పుకుంటారు, అన్నీ ఒకే మూసలో / ఫార్ములాలో ఉన్నా కూడా).

ఈ పాట పోస్ట్ చేసినందుకు థాంక్స్.

అవునండీ.. సినిమా గురించి బాగా చెప్పారు. థాంక్స్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ నరసింహారావు గారు.

ఈ సినిమాలో అన్ని సాంగ్స్ బావుంటాయి..ఆమెతోటి మాటుంది కూడా షేర్ చేయగలరా..

అలాగే శాంతి గారు.. త్వరలో ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.