సోమవారం, డిసెంబర్ 17, 2018

పొన్న చెట్టు నీడలో...

భలే కృష్ణుడు చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : భలే కృష్ణుడు (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు, సుశీల

ఊ..ఊ..ఊ..ఊ..
ఓ..హో..హో..హో..ఆ..ఆ..ఆ..ఆ

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే ఊగాయి నీలాల యమునలో..

ఆ..ఆ...అ.అ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

పొన్న చెట్టు నీడలో.. కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం
ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పొంగింది గగనాన భూపాల రాగం

ఎర్రనైన సంజెలో.. నల్లనయ్య నవ్వితే..
పలికింది పరువాన తొలివలపు రాగం..
తొలివలపు రాగం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..

ఆ..ఆ..ఆ..ఆ..రాగాలే..
ఊగాయి నీలాల యమునలో..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..
నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
చిన్నారి నెమలి చేసింది నాట్యం..

నీలమేఘశ్యాముని.. నీడ సోకినంతనే..
మైమరచి రాధమ్మ మరచింది కాలం
మరచింది కాలం..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే..ఊగాయి నీలాల యమునలో..

పొన్న చెట్టు నీడలో..కన్నయ్య పాడితే
రాగాలే రేగాయి రాధమ్మ మదిలో..
రాధమ్మ మదిలో..


6 comments:

మేమీరోజునించీ పూజ మొదలుపెట్టామండీ.

మార్గళి వచ్చిందనా సార్... కృష్ణుడి పాటలు...
కుదిరితే అన్ని సినిమాల్లో వచ్చిన నల్లనయ్య పాటల లిరిక్స్ ఇవ్వండి.అడ్వాన్స్ గా కృతజ్ఞతలు😊

అవునా.. నేను నిన్నటినుండే సిరీస్ మొదలు పెట్టేశాను శాంతి గారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

అవును రాజ్యలక్ష్మి గారు.. ఇప్పటివరకు వేసిన ధనుర్మాసం పాటలన్నీ వేణుగాన సమ్మోహనం అనే లేబుల్ లో చూడవచ్చండీ.. టాప్ రైట్ లో ప్రత్యేక సిరీస్ అన్న చోట లింక్ ఉంటుంది చూడండి.

అంటే..మూలకార్తె ధనుస్సంక్రమణం ..ఐ మీన్ ధనుర్స్మాసం 16 సాయంత్రం 5గంటల 27 నిమిషాలకు ప్రరంభమైందండి..అందువల్ల రెండూ కలిపి మరునాడు తెల్లవారుఝామున చేశాము..

ఓహ్ అవునా.. వివరించినందుకు ధన్యవాదాలు శాంతిగారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.