శుక్రవారం, డిసెంబర్ 07, 2018

ఏ మాయో ఏమో...

బ్లఫ్ మాస్టర్ చిత్రం కోసం సునీల్ కశ్యప్ స్వరపరచిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో వినాలంటే ఇక్కడ వినవచ్చు. ఎంబెడెడ్ లిరికల్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్లఫ్ మాస్టర్ (2018)
సంగీతం : సునీల్ కశ్యప్ 
సాహిత్యం : విశ్వనాథ్ కారసాల
గానం : సునీత 

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే


మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ..


తెలియని భావాలన్నీ
తోడై నన్నే చేరీ
నాతో చేస్తున్న సావాసమా
అర్ధాలెన్నో చూపే వేల భాషల్లోని
ప్రేమ గీతాల ఆలాపనా..     
కురిసే వరమై ఎదనే తడిమెనుగా
కలిసే వరసై మనసే మురిసెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఎలా
ప్రేమే నాలో చేరిందెలా..

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే


కొత్తగ నాకే నేను
పరిచయమౌతున్నాను
నాలో ఈ మాయ నీదే సుమా
చిన్ని మోమాటాలే
చెప్పే మౌనంగానే
ప్రేమ బాగుంది నీ భావనా
పలికే పెదవే సడినే మరిచెనుగా
ఐనా మరిలా నీ పేరే పలికెనుగా
అయ్యయ్యయ్యో నీలా ఇలా
ప్రేమే నాలో చేరిందెలా

ఏ మాయో ఏమో తెలియదే
తెలిసేదెలా మనసుకే
అడిగా తొలిగా నన్నే ఎవరనీ
రోజూ చూడని తీరే నీదని
ఏమైనదో తెలియదే
తెలిసేదెలా మనసుకే

మనసా నా మనసా..
నా మనసే.. ఓ.. ఓఓఓ.. 


4 comments:

సునీత గారి గొంతు లోనే మాధుర్యం ఉందేమో..
బాగుందండీ పాట..

నో డౌట్ రాజ్యలక్ష్మిగారు.. థాంక్స్ ఫర్ ద కామెంట్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.