శనివారం, డిసెంబర్ 08, 2018

పెద్ద పెద్ద కళ్ళతోటి...

హలో గురూ ప్రేమ కోసమే చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : హలో గురు ప్రేమకోసమే (2018)
సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
సాహిత్యం : శ్రీమణి
గానం : యాజన్ నిజర్

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!


చందమామ చుట్టూరా చుక్కలున్నట్టు
నన్ను చుట్టుముట్టాయే నీ ఊహాలే
పుట్టలోన వేలు పెడితే చీమ కొట్టినట్టు
నన్ను పట్టి కుట్టాయిలే

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!


ఓ ఇంగ్లీష్ భాష మీద పట్టు లేదే
తెలుగులోని ఛందస్సు చదవలేదే
హిందీలో షాయరీ మనకు రాదే
నాలో ఈ కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్నా
వేటూరి చిలిపితనం మెచ్చుకున్నా
ఎన్నాళ్ళ నుంచొ విన్న పాటలైనా
ఈరోజే నాకు నచ్చి పాడుతున్నా
పాతికేళ్లకొచ్చాక నడక నేర్చినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!


భూకంపమంటే భూమి ఊగిపోవడం
సైక్లోను అంటే ఉప్పెనొచ్చి ముంచడం
ఈరెంటికన్నా చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంట్లోన వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికిపాటు పేరు కలవరం
ఈరెంటికన్నా చాలా వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే కలవరించడం
ఇన్ని నాళ్లు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్లు కుందిలే

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావే ఓ పిల్లా..!

అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాలా..!
 

2 comments:

మూవి, మ్యూజిక్ కూడా బావున్నాయి..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.