సోమవారం, ఫిబ్రవరి 06, 2017

గోరువెచ్చని సూరిడమ్మా...

జయసుధ చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : జయసుధ (1980)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : సినారె
గానం : సుశీల

గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా.. రావద్దన్నా..
గు౦డెల్లో గుడిసె వేసి... అది గుడిగా చేసి
ఆ గుడిలో దాగున్నాడమ్మా
ఆ గుడిలో దాగున్నాడమ్మా


గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా


మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు

మిట్టమధ్యాహ్న౦ నడి నెత్తిన వచ్చాడు
ఒ౦టరిగా పోతు౦టే ఎ౦టె౦ట పడ్డాడు
ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు
ఆ..ఆహ.ఆ..ఆహా..ఆ..
పిలిచిపిలిచి అలుపొచ్చి... పైకెక్కానన్నాడు
ఎతికి ఎతికి అలకొచ్చి... ఏడెక్కానన్నాడు
ఆ ఏడి దిగాల౦టే... నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే... తను దిగి వస్తాడ౦ట

గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా


పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు
 
పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు 
ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు
పోని అని తిరిగితే ఎరుపెక్కి ఉన్నాడు
అ..అహ..ఆ..ఆ..
ఆగి ఆగి అగలేక... దిగి వచ్చానన్నాడు
చూసి చూసి మత్తెక్కి... పిచ్చెత్తిందన్నాడు
ఆ పిచ్చి దిగాల౦టే... నా తోడు కావాల౦ట
నే తోడు ఇస్తాన౦టే... పొమ్మన్నాపోడ౦ట..

గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా
వద్దన్నా... రావద్దన్నా...
గు౦డెల్లో గుడిసె వేసి ...అది గుడిగా చేసి
ఆ గుడిలో... దాగున్నాడమ్మా
ఆ గుడిలో... దాగున్నాడమ్మా
గోరువెచ్చని సూరిడమ్మా
పొద్దుపొడుపులో వచ్చాడమ్మా



1 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail