గురువారం, అక్టోబర్ 08, 2020

కలువకు చంద్రుడు...

చిల్లర దేవుళ్ళు సినిమాలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట రికార్డింగ్ సమయంలో "జలుబు చేసింది నేను పాడలేను" అన్నారట బాలు గారు. "ఈ పాటకు నీ జలుబు గొంతే అద్భుతంగా సూట్ అవుతుంది" అంటూ మహదేవన్ గారు పాడించుకున్నారని బాలు చెపిన విశేషాలు పాట తర్వాత వినండి. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో దొరకలేదు యూట్యూబ్ లో సరిగమ ఆడియో ఇక్కడ వినవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : బాలు

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ
అది కలిమిలేములను మరిపిస్తుంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

వలపు కన్నా తలపే తీయనా
కలయక కన్నా కలలే తీయనా
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా
నేటికన్న రేపే తీయనా

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం

మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ
వలపా మనసుకు అందానిస్తుంది
ఈ రెండూ లేక జీవితమేముంది
ఆ దేవుడికి.. మనిషికి.. తేడా ఏముంది

కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం
విరహంలోనే వున్నది అనుబంధం
కలువకు చంద్రుడు ఎంతో దూరం
కమలానికి సూర్యుడు మరీ దూరం
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.