రామారావు గారికి బాగా ఇష్టమైన పాట ఏంటో మీకు తెలుసా. ఆయన చేసిన సినిమాల్లో చాలా ఉండొచ్చు కానీ స్నేహం మీద ఉన్న ఈ పాట బాలుగారిని అడిగి మరీ పాడించుకునేవారట. నార్త్ ఇండియన్ ఖవాలి శైలిలో సాగే ఈ పాట నాకూ చాలా ఇష్టమైనది. సత్యన్నారాయణ గారు ఈ పాటలో పడిన కష్టాలు. రామారావు గారికి పోలీసుల పట్ల ఉన్న గౌరవం లాంటి విశేషాలు పాట తర్వాత బాలు నోట ఎంబెడెడ్ వీడియో లో వినండి.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : నిప్పులాంటి మనిషి (1974)
సంగీతం : సత్యం
సాహిత్యం : సినారె
గానం : బాలు
ఆ .. ఆ .. ఆ .. ఆ .. అల్లాయే దిగివచ్చి ...
అల్లాయే దిగివచ్చి... అయ్ మియ ఏమి కావాలంటే
మిద్దెలొద్దు.. మేడలొద్దూ.. పెద్దలెక్కే గద్దెలొద్దంటాను
ఉన్ననాడు.. లేనినాడు.. ఒకే ప్రాణమై నిలిచే
ఒక్క దోస్తే చాలంటాను.. ఒక్క నేస్తం కావాలంటాను
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..
స్నేహమేరా నాకున్నదీ.. స్నేహమేరా పెన్నిధీ..
స్నేహమే . . హొయ్
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం...
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
గుండెనే పలికించితే..
గుండెనే పలికించితే..
కోటి పాటలు పలుకుతాయ్
మమత నే పండించితే
మణుల పంటలు దొరుకుతాయ్
బాధలను ప్రేమించు భాయీ..
బాధలను ప్రేమించు భాయ్..
లేదు అంతకు మించి హాయ్
స్నేహమే . . హొయ్ !
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
కత్తిలా పదునైన చురుకైన మా వాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
కత్తిలా పదునైన చురుకైన మా వాడు
మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు
ఏమిటొ నీ బాధా ఆఆఅ...
ఏమిటొ నీ బాధా నాకైన చెప్పు భాయ్
ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి
ఆ రహస్యం కాస్త ఇకనైన విప్పవోయి
నిండుగ నువ్వు నేడు నవ్వాలి
అందుకు నెనేమి ఇవ్వాలోయ్..
నిండుగ నువ్వు నేడు నవ్వాలి..
అందుకు నెనేమి ఇవ్వాలి..
చుక్కలను కోసుకొని తెమ్మంటావా..
దిక్కులను కలిపేయమంటావా
దింపమంటావా....
దింపమంటావా ఆ చంద్రుణ్ణి .. హా..
తుంచమంటావా ఆ సూర్యుణ్ణి ..
ఏమి చెయ్యాలన్న చేస్తాను..
కోరితే ప్రాణమైన ఇస్తాను . .
హ ఏమి చెయ్యాలన్న చేస్తాను..
కోరితే ప్రాణమైన ఇస్తాను
దోస్తీకి నజరానా.. దోస్తీకి నజరానా..
చిరునవ్వురా నాన్నా..
దొస్తీకి నజరానా.. చిరునవ్వురా నాన్నా. .
ఒక్క నవ్వే చాలు ఒద్దులే వరహాలు..
హ హ హ హ
నవ్వెరా.. నవ్వెరా.. మావాడు..
ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా.. మావాడు..
ఆహా నవ్వెరా నిండుగా
నవ్వెరా నా ముందు..
రంజాను పండుగా
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం..
స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
2 comments:
బ్యూటిఫుల్ సాంగ్..
అవునండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.