బుధవారం, అక్టోబర్ 28, 2020

జాబిల్లి కోసం ఆకాశమల్లే...

పరిచయం అక్కర్లేని అద్భుతమైన పాట ఇది. బాలు గారు స్వరాభిషేకంలో ఈ పాటను మళ్ళీ ఎంత చక్కగా పాడారో వినండి. ఆత్రేయ గారి గురించి ఆయన చెప్పే కబుర్లు కూడా వినవచ్చు. సుమ సరదా కబుర్లు తనకి బాలుగారికి ఉన్న అనుబంధం కూడా చూడ ముచ్చటగా బావుంటుంది ఈ వీడియోలో.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : మంచిమనసులు (1986) 
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : ఆత్రేయ

గానం : యస్.పి.బాలు 
 
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
 
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై


నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పూవ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలీ ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవి

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోకపాడాను నేను పాటనై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై 

 
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళయినా
ఉండీ లేక ఉన్నది నువ్వే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాసల రూపం నువ్వే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్నా నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే 

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక
పాడాను నేను పాటనై

జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
వేచాను నీ రాకకై

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.