ఈ రోజు మహర్నవమి సందర్భంగా మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తూ బాలు గారి ఖ్యాతిని దశ దిశల వ్యాపింప చేసిన శంకరాభరణం చిత్రంలోని ఓ చక్కని పాటను తలచుకుందాం. ఏ గురువుగారి వద్దనూ శాస్త్రీయ సంగీతం నేర్చుకోనటువంటి బాలు గారు ఓ సంగీత కారుని సినిమాలో పాడలేనని భయపడిపోతే, మహదేవన్ గారి అసిస్టెంట్ పుహళేంది గారు ధైర్యం చెప్పి తనే గురువై రెండు వారాల పాటు సాధన చేయించి ఈ పాటలు పాడించిన వైనం బాలు గారి మాటలలో పాట తర్వాత వినండి.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శంకరాభరణం (1979)
సంగీతం : కె.వి.మహాదేవన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
శంకరా... నాద శరీరాపరా
వేద విహారా హరా జీవేశ్వరా
శంకరా నాద శరీరాపరా
వేద విహారా హరా జీవేశ్వరా
శంకరా.. ఆఅ...
ప్రాణము నీవని గానమె నీదని
ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ
రాగమె యోగమనీ
ప్రాణము నీవని గానమె నీదని
ప్రాణమె గానమనీ
మౌనవిచక్షణ గానవిలక్షణ
రాగమె యోగమనీ
నాదోపాసన చేసినవాడను
నీ వాడను నేనైతే
నాదోపాసన చేసినవాడను
నీ వాడను నేనైతే
దిక్కరీన్ద్ర జిత హిమగిరీన్ద్ర సిత
కందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ
నిర్నిద్రగానమిది అవధరించరా
విని తరించరా
శంకరా నాద శరీరాపరా
వేద విహారా హరా జీవేశ్వరా
శంకరా.. ఆఅ...
మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలూ
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలూ
మెరిసే మెరుపులు మురిసే పెదవుల
చిరు చిరు నవ్వులు కాబోలూ
ఉరిమే ఉరుములు సరి సరి నటనల
సిరి సిరి మువ్వలు కాబోలూ
పరవశాన శిరశూగంగా
ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరశూగంగా
ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువ్ మునుగంగా
ఆనంద వృష్టినే తడవంగా
ఆఆఆఅ...ఆఆఆఅ...
శంకరా నాద శరీరాపరా
వేద విహారా హరా జీవేశ్వరా
శంకరా.. ఆఅ..
శంకరా.. శంకరా..
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.