ఆదివారం, అక్టోబర్ 04, 2020

పల్లవించవా నా గొంతులో...

బాలచందర్ గారి దర్శకత్వంలో వచ్చిన "కోకిలమ్మ" సినిమాలోని ఈ పాట బాలుగారి లలితమైన స్వరాన్ని పట్టి చూపించే పాట. బాలచందర్ గారి ఆస్థాన సంగీత దర్శకులు ఎమ్మెస్ విశ్వనాథన్ గారి మధురమైన బాణీ ఆత్రేయ గారి సాహిత్యం కలసి కథానాయకుడి ప్రేమని మన కనుల ముందుంచేస్తాయి.

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కోకిలమ్మ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
సాహిత్యం : ఆత్రేయ
గానం : బాలు

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా

నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని
నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే 
నాదన్నది ఏమున్నది నాలో
నీవేనాడొ మలిచావు ఈ రాతిని 
నేనీనాడు పలకాలి నీ గీతిని

ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని
ఇదే నాకు తపమనీ 
ఇదే నాకు వరమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో

నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన
నీ ప్రేమకు కలశాన్ని 
నీ పూజకు నిలయాన్ని
నీ వీణకు నాదాన్ని కానా
నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన
నీకు ఈనాడు తెలిపేది నా వేదన

ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని
ఇదే నిన్ను వినమని 
ఇదే నిజం అనమని

చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది 
గుండె విప్పాలని ఉంది

పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో
ప్రణయ సుధా రాధా 
నా బ్రతుకు నీది కాదా
పల్లవించవా నా గొంతులో 
పల్లవి కావా నా పాటలో 
 


3 comments:

నాకు గుర్తు ఉన్నంత వరకు ఈ సినిమా తేజ టీవీ లో చాలాసార్లు వేశారు. అప్పట్లో అంతగా ఈ పాట అర్ధం తెలియకపోయినా, ఇప్పుడు వింటుంటే చాలా ఆహ్లాదంగా ఉంది. బాలు గారు మన మధ్యే ఉన్నట్లు ఉంది పాట వింటుంటే

అవునండీ.. ఆయన పాటలు వింటూంటే అదే ఫీల్.. థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్ జాన్సన్ గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.