మేకింగ్ పరంగా టెక్నికల్ వండర్ ఫిల్మ్ విచిత్ర సోదరులు లోని ఒక అద్భుతమైన పాట నిన్ను తలచి. ఈ పాటను స్వరాభిషేకం స్టేజ్ పై బాలు గారు ఎంత అద్భుతంగా పాడారో చూడండి. ఈ పాట మొదటి సారి విన్నప్పుడు చివర్లో టేప్ పాడైందా అని అనుమానం వస్తుంది. కమల్ మాస్క్ వేస్కుని చేసిన నటనకి తగినట్లుగా బాలుగారు ఎలా పాడారో ఈ వీడియోలో చూస్తూ ఆయన మాటలలో వినవచ్చు.
చిత్రం : విచిత్ర సోదరులు (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే
ఓ చెలీ...
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆడుకుంది నాతో జాలిలేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హోరు గాలిలోన ఊకనైతి నేనే
గాలి మేడలే కట్టుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్నా
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా..
కల చెదిరెను కాదా.. అంతే..
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపొయే ఆశ తీరు పూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసి ఉన్న తల రాత తప్పదు..
చిత్రమే.. అది చిత్రమే..
గుండె కోతలే నాకు ఇప్పుడు
చిత్రమే.. అది చిత్రమే..
కథ ముగిసెను కాదా
కల చెదిరెను కాదా..
అంతే..
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ
ఈ భూమి చేరదని
నాడు తెలియదులే
ఈ నాడు తెలిసెనులే.. ఓ చెలీ..
నిన్ను తలచి మైమరచా
చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా
చిత్రమే అది చిత్రమే
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.