కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన పాట. చిరంజీవి లాంటి మాస్ హీరోకి కంపోజ్ చేసిన క్లాస్ పాట. క్లాసు మాస్ ల అందమైన కలయిక ఈ పాట. ఇళయరాజా మాజికల్ సంగీతంతో ఓ పక్కన హుషారుగా ఉరకలు పెట్టిస్తూనే అందమైన మెలోడీని వినిపించే పాట. వేటూరి గారు అందంగా రాసిన పాట. డెబ్బై ఏళ్ళ వయసులో బాలుగారు స్వరాభిషేకం స్టేజ్ పై ఎలా పాడారో విన్న తర్వాత చివర్లో ఈ పాట గురించి చిరంజీవి గురించి ఆయన చెప్పే కబుర్లు కూడా వినండి.
చిత్రం : కొండవీటి దొంగ (1990)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, చిత్ర
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
చైత్రమాస మొచ్చెనేమో చిత్రమైన ప్రేమకి
కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకి
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికి
మెచ్చి మెచ్చి చూడసాగె గుచ్చే కన్నులు
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలు
అంతేలే కథంతేలే అదంతేలే...
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
తొలిముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పూవ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలతో
వత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో...
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
హంసలేఖ పంపలేక హింసపడ్డ ప్రేమకి
ప్రేమలేఖ రాసుకున్నా పెదవి రాని మాటతో
రాధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచి ఉన్నా వేణు పూలతోటలో
వాలు చూపు మోసుకొచ్చె ఎన్నో వార్తలు
వొళ్ళో దాటి వెళ్ళసాగే ఎన్నో వాంఛలు
అంతేలే కధంతేలే అదంతేలే...
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారద మల్లెల పూల జల్లే వెన్నెల నవ్వులలో
శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో...
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో!
2 comments:
శుభలేఖ రాసుకున్నా
ప్రభాత వేళ అది నీకు పంపితి నెపుడో
విభలు విరిసె బుగ్గలలో
న భామినీ నీలవేణి నవ్వుల లోనన్!
థ్యాంక్స్ జిలేబి గారు..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.