ఆదివారం, అక్టోబర్ 11, 2020

వీణ నాది తీగ నీది...

కటకటాల రుద్రయ్య సినిమా కోసం వేటూరి గారు రాసిన ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. జె.వి.రాఘవులు గారు స్వరపరచిన ఈ పాట ఒరిజినల్ సుశీల గారు బాలు గారు పాడితే ఈ స్వరాభిషేకం వీడియోలో బాలుగారితో నా అభిమాన గాయని సునీత స్వరం కలిపారు. 

ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : కటకటాల రుద్రయ్య (1978)
సంగీతం : జె.వి. రాఘవులు  
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల 

వీణ నాది..తీగ నీది
తీగ చాటు రాగ ముంది.. 
పువ్వు నాది..పూత నీది..
ఆకుచాటు అందముంది.. 
వీణ నాది..తీగ నీది..
తీగ చాటు రాగ ముంది.. 
తీగ చాటు రాగ ముంది...  
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు

తొలిపొద్దు ముద్దాడగానే 
ఎరుపెక్కె తూరుపు దిక్కూ 
తొలిచూపు రాపాడగానే 
వలపొక్కటే వయసు దిక్కూ 
వరదల్లే వాటేసి మనసల్లే మాటేసి
వయసల్లే కాటేస్తే చిక్కు 
తీపిముద్దిచ్చి తీర్చాలి మొక్కు 

వీణ నాది తీగ నీది 
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు

మబ్బుల్లో మెరుపల్లే కాదూ 
వలపు వాన కురిసీ వెలిసి పోదూ
మనసంటే మాటలు కాదూ 
అది మాట ఇస్తే మరచి పోదూ 
బ్రతుకల్లే జతగూడి 
వలపల్లె ఒనగూడి 
వొడిలోనే గుడి కట్టే దిక్కు 
నా గుడి దీపమై నాకు దక్కూ 

వీణ నాది తీగ నీది
తీగ చాటు రాగ ముంది 
పువ్వు నాది పూత నీది
ఆకుచాటు అందముంది
వీణ నాది.. తీగ నీది..
తీగ చాటు రాగ ముంది
తీగ చాటు రాగ ముంది

మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ హుహు 
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్మ్ హుహు 


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.