బుధవారం, అక్టోబర్ 14, 2020

తెల్ల చీర.. కళ్ళ కాటుక..

మీకు ఇనప లవ్వు పాట గురించి తెలుసా ? బాలుగారు చెప్తారు ఈ వీడియోలో వినండి. బాలు గారు ఏదో సభలో "జానకి గారు కదలకుండా నిలబడి అంత ఎక్స్ప్రెసివ్ గా ఎలా పాడగలరో నాకు ఆశ్చర్యమేస్తుంది" అని అన్నారు ఓసారి. ఈ వీడియోలో బాలు గారిని చూస్తే ఆయనకి అలా ఎందుకనిపించిందో హుషారైన పాటలు ఆయన ఎంతలా ఎంజాయ్ చేస్తూ పాడతారో తెలుస్తుంది. ఈ పాట ఆయన డెబ్బై ఏళ్ళ వయసులో స్టేజ్ మీద పాడుతున్నారనే విషయం మనకి గుర్తే రాదు. 
  
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సర్దార్ పాపారాయుడు (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : దాసరి
గానం : బాలు, సుశీల

తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా

ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
ఆ కబురేమిటమ్మా  ఈ పరుగెందుకమ్మా

మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు
మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు
పట్టుకొని వచ్చాడు కిష్టప్పా
మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

జాంపండు చూస్తే కొరకబుద్ది 
లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాంపండు చూస్తే కొరకబుద్ది 
లేత బుగ్గ చూస్తే నిమరబుద్ధి
జాబిల్లిని చూస్తుంటే చూడబుద్ది 
ఈ పిల్లను చూస్తుంటే ఆడబుద్ది
ఎందుకీ పాడుబుద్ది అందుకే తన్నబుద్ది
బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది
బుద్దిమంచిదే పిల్ల వయసు చెడ్డది
వయసు ముదిరితే పిల్ల పెళ్ళి చెడ్డది

మల్లె పూలు.. పట్టు చీర.. ఎర్రగాజులు
మల్లె పూలు.. పట్టు చీర .. ఎర్రగాజులు
పట్టుకొని వచ్చాడు కిష్టప్పా
మంచి గుబులు మీదున్నాడు కిష్టప్పా
ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య
ఆ గుబులేమిటయ్య... ఈ ఉరుకేమిటయ్య

ఆకాశం చూస్తే మబ్బులెయ్య 
పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య 
హోయ్..... హోయ్
ఆకాశం చూస్తే మబ్బులెయ్య 
హోయ్ 
పక్కనున్న దీన్ని చూస్తే చిందులెయ్య
నీ మాటలన్ని వింటుంటే సిగ్గులెయ్య 
సిగ్గులన్ని కైపెక్కి మొగ్గలెయ్య
ఎందుకీ గోడవలయ్యా పిచ్చి మనసు రామయ్య
మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది
ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది
మనసు పిచ్చిదే పిల్ల ప్రేమ గుడ్డిది
ప్రేమ ముదిరితే పిల్ల పిచ్చి పడతది

తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
తెల్ల చీర.. కళ్ళ కాటుక.. ఎర్రబొట్టు
పెట్టుకొని వచ్చింది క్రిష్ణమ్మా
ఏదో కబురు పట్టుకొచ్చింది క్రిష్ణమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
ఆ కబురేమిటమ్మా ఈ పరుగెందుకమ్మా
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.