గురువారం, అక్టోబర్ 29, 2020

శివరంజని నవరాగిణీ...

తమిళ్ లో అపూర్వ రాగంగళ్ సినిమా కథని తెలుగులో శివరంజని గా చిత్రీకరించినా. తమిళ పాటల సంగీతాన్ని వాడుకోకుండా తెలుగులో కొత్త ట్యూన్స్ ని ఎన్నుకున్నారు. వాటిలో సంగీత సాహిత్యాలు అద్భుతంగా కుదిరి సూపర్ హిట్ అయిన పాట శివరంజని. స్వరాభిషేకం వేదిక పై బాలు గారు ఈ పాటను ఎంత చక్కగా పాడారో వినండి. అలాగే ఈ సినిమా గురించి పాట గురించి బోలెడు కబుర్లు బాలు గారి గొంతులో వినవచ్చు ఎంబెడెడ్ వీడియో లో.   
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : తూర్పూ పడమర (1976)
సంగీతం : రమేష్ నాయుడు 
సాహిత్యం : సినారె
గానం : బాలు

శివరంజని నవరాగిణి
వినినంతనే నా తనువులోని
అణువణువు కరిగించే అమృత వాహిని
ఆఆఆఆఆ...ఆఆఆఆ...
శివరంజని నవరాగిణీ.. ఆఆఆ... 

 
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
రాగల సిగలోన సిరిమల్లివీ
సంగీత గగనాన జాబిల్లివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
స్వర సుర ఝురీ తరంగానివీ
సరస హృదయ వీణా వాణివీ

శివరంజని నవరాగిణి.. ఆఆఆఆ..

ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ కనులు పండు వెన్నల గనులు
ఆ కురులు ఇంద్ర నీలాల వనులు
ఆ వదనం అరుణోదయ కమలం
ఆ అధరం సుమధుర మధు కలశం...

శివరంజని నవరాగిణీ...ఆఆఆఆ..

జనకుని కొలువున అల్లన సాగే జగన్మోహిని జానకి
వేణుధరుని రథమారోహించిన విదుషిమణి రుక్మిణి
రాశీకృత నవరసమయ జీవన రాగాచంద్రికా
లలిత లావణ్య భయద సౌందర్య కలిత చండికా
రావే...ఏఏఏ.. రావే నా శివరంజని..
మనోరంజని.. రంజని నా రంజని

నీవే నీవే నాలో పలికే నాదానివీ
నీవే నాదానివీ
నా దానివి నీవే నాదానివీ 
 


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.