ఆదివారం, అక్టోబర్ 25, 2020

శివానీ... భవానీ...


మిత్రులందరకూ దసరా శుభాకాంక్షలు. స్వాతికిరణం చిత్రంకోసం బాలు గారు అద్భుతంగా గానం చేసిన ఓ చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఎంబెడ్ చేసినది అమెరికాలో నిర్వహించిన స్వరాభిషేకంలో బాలు గారు పాడినప్పటి వీడియో. ఇక సినిమాలో ఈ పాటను శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీ వారి ముందు గానం చేస్తున్నట్లు చిత్రీకరించారు. ఈ పర్వదినాన ఈవిధంగా స్వామీజీని తలచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది.
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు రెండు నిముషాల తర్వాత బాలు గారి వర్షన్ మొదలవుతుంది. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు

శివానీ... భవానీ... శర్వాణీ...
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ...

శృంగారం తరంగించు సౌందర్య లహరివని... ఆ....
శృంగారం తరంగించు సౌందర్య లహరివనీ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని... ఆ...
శాంతం మూర్తీభవించు శివానంద లహరివని...
కరుణ చిలుకు సిరినగవుల కనకధారవీవనీ
నీ దరహాసమే దాసుల దరిజేర్చే దారియనీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ

శివానీ... భవానీ... శర్వాణీ... 
 
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళివీవనీ
భీతావహ భక్తాళికి అభయపాణివీవనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ
బీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివనీ...
భీషణాస్త్ర కేళివనీ...
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావనీ
 
గిరినందిని శివరంజని భవ భంజని జననీ
శతవిధాల శ్రుతి విధాన స్తుతులు సలుపలేని
నీ సుతుడనే శివానీ
శివానీ... భవానీ... శర్వాణీ...



2 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.