శనివారం, అక్టోబర్ 31, 2020

పాడనా తీయగా...

ఈ పాట మిగిలిన సాహిత్యం ఎలా ఉన్నాకానీ పల్లవి లోని మొదటి రెండు లైన్లు పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోటా అన్న లైన్స్ బాలు గారికి ఎంతగా నప్పుతాయో. హారీస్ జైరాజ్ మొదటి సారి తెలుగులో స్వరపరచిన ఈ పాట వెంకీ యాభైవ చిత్రమైన వాసు సినిమాలోది. బాలు గారికి నంది అవార్డ్ తెచ్చిపెట్టిన ఈ పాటను స్వరాభిషేకం వేదిక పై ఎంత కమ్మగా పాడారో మీరూ వినండి. హారిస్ జైరాజ్ గురించి బాలు గారు చెప్పే మాటలు వీడియోలో పాట తర్వాత వినవచ్చు.     
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : వాసు (2002)
సంగీతం : హారీస్ జైరాజ్ 
సాహిత్యం : పోతుల రవికిరణ్
గానం : బాలు

నీ జ్ఞాపకాలే నన్నే తరిమెనే
నీకోసం నేనే పాటై మిగిలానే
చెలియా చెలియా... ఓ... చెలియా...

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
ఆరాధనే అమృతవర్షం అనుకున్నా
ఆవేదనే హాలాహలమై పడుతున్నా
నా గానమాగదులే ఇక నా గానమాగదులే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

గుండెల్లో ప్రేమకే...
గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో
తనువంతా పులకించే
వయసంతా గిలిగింతే
ప్రేమించే ప్రతిమనిషీ ఇది పొందే అనుభూతే
అనురాగాల సారం జీవితమనుకుంటే
అనుబంధాల తీరం ఆనందాలుంటే
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 
ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట

ఆకాశం అంచులో...
ఆకాశం అంచులో ఆవేశం చేరితే
అభిమానం కలిగెనులే
అపురూపం అయ్యెనులే
కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నావే
కలువకు చంద్రుడు దూరం... ఓ నేస్తం
కురిసే వెన్నెల వేసే ఆ బంధం
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 
ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే 

ఓ ప్రేమా.. ఓ ప్రేమా.. ఓ ప్రేమా.. 
ఓ ప్రేమా.. ఓ ప్రేమా.. ఓ ప్రేమా.. 
పాడనా తీయగా కమ్మని ఒకపాట
పాటగా బతకనా మీ అందరినోట
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.