శ్రీవారు మావారు సినిమా కోసం కృష్ణగారికి పాడిన ఈ పాట మాతృక హిందీ పాట. వినీ వినీ ఆ విషయమే మర్చిపోయాను నేను తెలుగు పాటనే అనుకుంటూ ఉంటాను. ఇక స్వరాభిషేకం లో పాడాక "ఈ రోజు కూడా రెండు సార్లు రిహార్సల్ చేస్తే కానీ నోట్ పట్టుకోలేకపోయాను" అని వినయంగా చెప్తున్న బాలు గారికి నమస్కరించకుండా ఉండగలమా. అన్నట్లు ఈ పాటలో గిటార్ ప్లే చేసింది ఇళయరాజా గారట.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : శ్రీవారు మావారు (1973)
సంగీతం : జి.కె. వెంకటేశ్
సాహిత్యం : సినారె
గానం : బాలు
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. హా....
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ.... హా....
లాలలలల లాలల... లలలాలలల..
లాలలలల లాలల... లలలాలలల..
మబ్బుకన్నెలు పిలిచేనని..
మనసు రివ్వున ఎగిసేనని..
వయసు సవ్వడి చేసేనని..
ఇపుడే తెలిసిందీ....
రు రు రు రు..ఆ..ఓ
పూలు గుసగుసలాడేనని.. జతగూడేననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ.. అ....
అలలు చేతులు సాచేనని..
నురుగు నవ్వులు పూచేనని..
నింగి నేలను తాకేనని..నేడే తెలిసిందీ..!!
రు రు రు రు..ఆ.. ఓ..
పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
టుర్..ఆ ఆ హు...ఆ హు..
టుర్..ఆ ఆ హు...ఆ హు..
పైరు పచ్చగ ఎదిగున్నది...
పల్లెపడుచుల విసురున్నది...
కొత్త సొగసే రమ్మన్నది...
గుండె ఝుమ్మన్నది...
రు..రు..రు..రు... హో..హొ..
పూలు గుసగుసలాడేనని.. జతగూడననీ..
గాలి ఈలలు వేసేనని.. సైగ చేసేననీ..
అది ఈరోజే తెలిసిందీ....
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.