బుధవారం, అక్టోబర్ 07, 2020

మేడంటే మేడా కాదు...

సుఖదుఃఖాలు సినిమాలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. పాట పాడాక కోదండపాణి గారి గురించి బాలు గారు చెప్పిన మాటలు వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : సుఖదుఃఖాలు (1968)
సంగీతం : కోదండపాణి
సాహిత్యం : దేవులపల్లి
గానం : బాలు

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
నేనైతె ఆకు కొమ్మ 
తానైతె వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన 
పొదరిల్లు మాది  

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

కోవెలలొ వెలిగే దీపం 
దేవి మా తల్లి
కోనలలో తిరిగే పాటల 
గువ్వ మా చెల్లి
గువ్వంటే గువ్వా కాదు 
గొరవంక గాని
వంకంటే వంకా కాదు 
నెలవంక గాని

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 

గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గోరింక పెళ్ళైపొతే 
ఏ వంకో వెళ్ళిపొతే
గూడంతా గుబులై పోదా 
గుండెల్లో దిగులై పోదా 

మేడంటే మేడా కాదు 
గూడంటే గూడూ కాదూ
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది 
పదిలంగా అల్లుకున్నా 
పొదరిల్లు మాది 
పొదరిల్లు మాది
 


2 comments:

అన్నా చెల్లెళ్ల మధ్య బంధాన్ని, ప్రేమను ఎంతో హృద్యాత్మకంగా తెలియజేసే పాట. వింటుంటే హృదయం బరువెక్కుతుంది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచనా నైపుణ్యానికి ఈ పాట ఒక మచ్చు తునక....RP from Warangal 21.10.2020

థ్యాంక్స్ రాజేంద్రప్రసాద్ గారు. మంచిమాట చెప్పారండీ.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.