గీతాంజలి సినిమాలోని ఓ పాపాలాలి పాట గురించి ఎంత చెప్పినా తక్కువే అలాంటి పాటను కంపోజ్ చేసిన ఇళయరాజా గారి గురించి తనతో ఉన్న అనుబంధం గురించి ఆయన కంపోజింగ్ స్టైల్ గురించి ఎన్ని కబుర్లు చెప్పారో బాలు గారు ఈ వీడియోలో. నాకోసం వాడు పుట్టాడు వాడికోసం నేను పుట్టాను అని ఆయన చెప్పే మాటలు ఎంత నిజమో కదా అని మనకీ అనిపిస్తుంది.
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు. సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.
చిత్రం : గీతాంజలి (1989)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : బాలు
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి
నా జోలలా లీలగా తాకాలని
గాలినే కోరనా జాలిగా
నీ సవ్వడే సన్నగా ఉండాలని
కోరనా గుండెనే కోరిక
కలలారని పసి పాప తల వాల్చిన వొడిలో
తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో
ఇరు చేపల కనుపాపలకిది నా మనవీ
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి
ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి
గాలిలో తేలిపో వెళ్ళిపో
ఓ కోయిలా పాడవే నా పాటని
తీయనీ తేనెలే చల్లిపో
ఇరు సందెలు కదలాడే యెద ఊయల వొడిలో
సెలయేరుల అల పాటే వినిపించని గదిలో
చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవీ
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా తీయగా
ఓ పాపా లాలి జన్మకే లాలి
ప్రేమకే లాలి పాడనా
ఓ పాపా లాలి
4 comments:
Can we have a song from స్వాతికిరణం
తప్పకుండా ప్రదీప్ గారు. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.
జన్మకే లాలీ..అని ఇప్పుడు వింటే బాధగా ఉంది..
నిజమేనండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి
పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.