సోమవారం, అక్టోబర్ 26, 2020

ఓలమ్మీ తిక్కరేగిందా..

మరో ఇనప లవ్వు పాట యమగోల లో ఓలమ్మీ తిక్క రేగిందా పాట. అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపేసిన పాట. అండ్ ఇప్పటికి విన్నా చూసినా నవ్వులు పూయించే పాట. అన్నట్లు అప్పట్లో బాలుగారికి పెద్దగా పొట్ట ఉండేది కాదట ఎందుకో తెలుసా ఈ వీడియో తర్వాత బాలుగారి మాటలు వినండి అర్థమవుతుంది. స్వరాభిషేకం వీడియోలో రమ్య బెహరా కూడా చాలా బాగా పాడింది. బాలుగారి ముందు పాడాలంటేనే బాగా పాడాలి అనుకోండి ఇక ఆయనతో ఇలాంటి పాట పాడాలంటే బాగా పాడక పోతే ఎలా కుదురుతుంది.   
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు. 


చిత్రం : యమగోల (1977)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఓలమ్మీ తిక్కరేగిందా.. 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓలమ్మీ తిక్కరేగిందా.. 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి.. 
పైరగాలి పైటదీసి
పందిరేసి.. చిందులేసిందా

ఓరబ్బీ తిక్క రేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
తిక్కరేగి తిమ్మిరెక్కి 
పిల్లగాలి చిచ్చురేపి
రెచ్చగొట్టిందా 
కొత్త పిచ్చి పట్టిందా

ఓలమ్మీ తిక్కరేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

కాలు కురచ కన్నెపిల్ల కన్ను చెదిరిందా
మూర తక్కువ చీర నీకు నిలువనంటుందా
బక్కపలచ ఉడుకు నీలో బలిసిపోయిందా
ముట్టుకుంటే ముద్దులై 
నే పట్టుకుంటే జారిపోయే
సిగ్గువలపు మొగ్గలేసిందా

ఓరబ్బీ తిక్క రేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

రంగు దేలి గిత్త పొగరు రంకె వేసిందా
గంగడోలు తాకితేనే కాలు దువ్విందా
కోడెవయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా
పట్టపగలే చుక్కపొడిచి పంటచేను గట్టుమీద
బంతిపూల పక్కవేసిందా..

ఓలమ్మీ తిక్కరేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా

పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు?
చల్లకొచ్చి ముంత ఎందుకు దాచుకుంటావు?
వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు
ఆరుబయట అందమంతా ఆరబోసి కస్సుమంటూ
కన్నెమోజు కట్టుతప్పిందా

ఓరబ్బీ తిక్క రేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా
ఓరబ్బీ తిక్క రేగిందా 
ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా


 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.