గురువారం, అక్టోబర్ 22, 2020

తొలి వలపు తొందరలు...

సొమ్మొకడిది సోకొకడిది చిత్రంలోని ఈ చక్కని పాట తెలియని వారుండరేమో. హ్యూస్టన్ లో స్వరాభిషేకం కండక్ట్ చేసినపుడు స్టేజ్ మీద బాలు గారితో పాడిన శ్రావణ భార్గవి ఈ పాట పాడిన తర్వాత మీకు కోపం రావచ్చేమో కానీ నాకో చిన్న కోరిక ఉంది కోరనా అని అడిగింది. ఆవిడ ఏం కోరిందో దానికి బాలు గారి అల్లరి ఎలా ఉందో. అంతటి గొప్పవారైనా కూడా ఏమాత్రం భేషజం లేకుండా ఈతరం గాయనీగాయకులతో ఎంత సరదాగా చిన్నపిల్లాడిలా ఎలా కలిసిపోతారో ఈ వీడియోలో చూస్తే ముచ్చటేస్తుంది.  
 
ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ ఈటీవీ స్వరాభిషేకం వీడియో ఇక్కడ చూడవచ్చు.  సినిమాలోని ఒరిజినల్ వీడియో ఇక్కడ చూడవచ్చు. ఈ సిరీస్ లో నేను షేర్ చేస్తున్న వీడియోలు అన్నీ యూట్యూబ్ ప్లేలిస్ట్ లో ఇక్కడ చూడవచ్చు.  


చిత్రం : సొమ్మొకడిది సోకొకడిది (1978)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, ఎస్.జానకి

తొలి వలపు తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను చలితో నీవు
చేసే అల్లరులు

ఆ..తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు చలితో నేను
చేసే అల్లరులు

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు

పిలిచే నీ కళ్ళు.. తెలిపే ఆకళ్ళు
కరగాలి కౌగిళ్ళలో
వలపించే వళ్ళు.. వలచే పరవళ్ళు
కదిలే పొదరిళ్ళలో  
తెరతీసే కళ్ళు.. తెరిచే వాకిళ్ళు
కలవాలి సందిళ్ళలో
పూసే చెక్కిళ్ళు.. మూసే గుప్పిళ్ళు
బిగిసే సంకెళ్ళలో
నీలో అందాలు.. నేనే పొందాలు
నాకే చెందాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నేను..చలితో నీవు
చేసే అల్లరులు హా...

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

కురిసే ఈ వాన.. తడిసే నాలోనా
రేపిందిలే తపనా
పలికే పరువాన.. వలపే విరివాన
నీవే ఆలాపనా
వణికే నీ మేన.. సణిగే నా వీణ..
పలికిందిలే మోహనా
విరిసే నా నవ్వు.. విరజాజీ పువ్వు..
సిగలో నేనుంచనా
నీలో రాగాలు.. నాలో రేగాలి
నేనే ఊగాలిలే

తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు
చెలితో నీవు..చలితో నేను
చేసే అల్లరులు
తొలివలపూ తొందరలు
ఉసిగొలిపే తెమ్మెరలు

తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు
తొలివలపు.. తొందరలు
ఉసిగొలిపే.. తెమ్మెరలు
 

2 comments:



తొలివలపు తొందరలు ఉసి
గొలిపే తెమ్మెరలు పలికి కురిసెడు విరివా
నలు నీ ఆలాపనల సి
గలోన పూవులిడనా మృగాక్షి జిలేబీ



జిలేబి

బావుందండీ.. థ్యాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.