
ఈ పాట మిగిలిన సాహిత్యం ఎలా ఉన్నాకానీ పల్లవి లోని మొదటి రెండు లైన్లు పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోటా అన్న లైన్స్ బాలు గారికి ఎంతగా నప్పుతాయో. హారీస్ జైరాజ్ మొదటి సారి తెలుగులో స్వరపరచిన ఈ పాట వెంకీ యాభైవ చిత్రమైన వాసు సినిమాలోది. బాలు గారికి నంది అవార్డ్ తెచ్చిపెట్టిన ఈ పాటను స్వరాభిషేకం వేదిక పై ఎంత కమ్మగా పాడారో మీరూ వినండి. హారిస్ జైరాజ్ గురించి బాలు గారు చెప్పే మాటలు వీడియోలో పాట తర్వాత వినవచ్చు. ఈ...