గురువారం, నవంబర్ 10, 2016

విన్నపాలు వినవలె...

 
క్షీరాభ్ది ఏకాదశి సంధర్బంగా ఆ శ్రీనివాసుడ్ని స్మరించుకుంటూ అన్నమయ్య చిత్రంలో కీర్తనలతో కూర్చిన ఒక చక్కని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అన్నమయ్య (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : అన్నమయ్య
గానం : బాలు, రేణుక, శ్రీలేఖ, పార్ధసారధి

విన్నపాలు వినవలె వింతవింతలూ
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా
విన్నపాలు వినవలె వింతవింతలూ.. ఊ ఊ...

కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియలేడింట
అంటి అలమేలుమంగ
అండనుండే స్వామిని.. కంటీ.. ఈ ఈ ...

పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు
కొంత పెడమరలి నవ్వీనీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గువడియె పెండ్లి కూతురూ... ఊ ఊ...

అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ
అలవాటు సేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్చ్వాస పవనమందుండ
నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల
ఉయ్యాల..ఉయ్యాల

2 comments:

సార్,
నాకు కొతజీవితాలు సినిమాలో "తంతననంతన తాళంలో.." పాట లింకు కొంచెం అందించగలరు.

ఆల్రెడీ ప్రచురించానండీ.. లింక్ ఇక్కడ..
http://sarigamalagalagalalu.blogspot.in/2014/10/blog-post_9.html

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail