మంగళవారం, నవంబర్ 15, 2016

హృదయమనే కోవెల తలుపులు...

పెళ్ళిసందడి చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : పెళ్ళిసందడి (1997)
సంగీతం : కీరవాణి
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలు, చిత్ర

ఆఆఅ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి
అంకితమిచ్చును ప్రేమ
తను నిలువున కరుగుతు
కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకు వంతెన
వేసిన వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
 
ఆఆఆ హృదయమనే కోవెలు
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఇవ్వటమే నేర్పగల ఈ ప్రేమ
తనకొరకు ఏ సిరిని అడగదు కదా
నవ్వటమే చూపగల ఈ ప్రేమ
మంటలనె వెన్నెలగ మార్చును కదా
గాలికి గంధము పూయటమే
పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే
కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఏ జతనో ఎందుకో విడదీసి
వెంటాడి వేటాడు ఆటే ప్రేమ
మౌనముతో మనసునే శృతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరితల ఈ ప్రేమ
మృత్యువు ఎరుగని చిరునామా
శ్వాసను మంగళహారతిగా
వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని ఎదిరించి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
మరణాన్ని ఎదిరించి మరుజన్మగా వచ్చి
కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఆ ఆ ఆ హృదయమనే కోవెల
తలుపులు తెరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆ ఆ ఆ త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ


0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail