శుక్రవారం, నవంబర్ 18, 2016

ఇంటికి దీపం ఇల్లాలే...

అర్ధాంగి చిత్రంలోని ఒక చక్కని పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ  పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అర్థాంగి (1955)
సంగీతం : బి.నరసింహరావు.ఎమ్.వేణు
రచన : ఆత్రేయ
గానం : ఘంటసాల

ఇంటికి దీపం ఇల్లాలే
ఇంటికి దీపం ఇల్లాలే ఇల్లాలే
సుఖాల పంటకు జీవం ఇల్లాలే ఇల్లాలే 
ఇంటికి దీపం ఇల్లాలే

కళకళలాడుతు కిలకిల నవ్వుతు
కళకళలాడుతు కిలకిల నవ్వుతు
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
బ్రతుకే స్వర్గము అనిపించునుగా
పతికే సర్వము అర్పించునుగా

ఇంటికి దీపం ఇల్లాలే

నాధుని తలలో నాలుక తీరున
నాధుని తలలో నాలుక తీరున
మంచి చెడులలో మంత్రి అనిపించును
మంచి చెడులలో మంత్రి అనిపించును
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించునూ.
అభిరుచి తెలిసీ - ఆకలి నెరిగీ
అన్నము పెట్టే అమ్మను మించును

సహచర్యములో, పరిచర్యలలో
సహచర్యములో, పరిచర్యలలో
దాసిగా తరింప జూచుచు
దాసిగా తరింప జూచుచు
దయావాహిని - ధర్మరూపిణి
భారత మానిని - భాగ్యదాయినీ

2 comments:

దీపమంటి పాట..

బాగా చెప్పారండీ.. థాంక్స్ ఫర్ ద కామెంట్.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail