సోమవారం, నవంబర్ 21, 2016

చిలకమ్మా చిటికేయంట...

దళపతి సినిమాలో ఓ హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : దళపతి (1991)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, చిత్

అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఇక సాగాలి మేళాలంట.. జగజగజగజాం
ఈ సరదాలే రేగాలంటా.. జగజగజగజగజగజగ

ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
ఈ చినదాని మెడలో వేయరా.. జగజగజగజాం
నడిరేయంతా సందడిచేయరా.. జగజగజగజగజగజగ

ఆ టక్కరిగాడే అహ ఈ బుల్లోడే
నను కట్టివేసే మొనగాడే లేడే

జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..

ఆహా...

అరె చిలకమ్మా చిటికేయంటా
నువు రాగాలే పాడాలంటా

ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా

చీకుచింత లేదు చిందులేసే ఊరు.. పాటా ఆటా ఇది ఏందంటా
అహ ఊరిలోని వారు ఒక్కటైనారు.. నీకు నాకు వరసేనంటా
పండగ నేడే మన ఊరికే.. ఆశలు రేపే కలలూరేనే
వాడనిదంట ఈ వేడుకే.. అందరికింకా వెత తీరేనే
అహ ఈ పూట కానీరా ఆటపాటా..

బుల్లెమ్మా నవ్విందంట.. జగజగజగజాం
మణిముత్యాలే రాలేనంట.. జగజగజగజగజగజగ

అరె మామయ్య రేగాడంట.. జగజగజగజాం
నా మనసంతా దోచాడంట.. జగజగజగజగజగజగ

నీ మాటే నాకు.. ఓ వెండి కోట
నువు నాదేనంటా.. నీతోనే ఉంటా..ఆ..

జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చటక్కు చక్కు జాంగు చక్కు ఛా..

హే హే హే...

అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట

అరె మామయ్య రేగాడంట
నా మనసంతా దోచాడంట

వేడుకైన వేళ వెన్నెలమ్మల్లాగ.. దీపం నీవై వెలగాలంట
అహ చీకటంతా పోయే పట్టపగలాయే.. ఏలా దీపం ఇక మనకంట
జాతికి నేడే మంచి కాలమే.. నమ్మకముంటే వచ్చి తీరేనే
ఊరికి నీవే మేలు కోరితే కోరికలన్నీ రేపే తీరేనే..
అరె ఆనందం నీ సొంతం అంతే కాదా..

చిట్టెమ్మా నన్నే చూడు
జత చేరమ్మా నాతో పాడు

మురిపాల పండగ పూట
మన ముచ్చట్లే సాగాలంట

ఉమ్.. ఉమ్.. ఉమ్..

బంగారు పరువం.. పలికె ఈ వేళా.. గుసగుసలు
పడుచు కలలే వాగులై పాయెనే.. మహదానందం
చిలిపి కథలన్ని మురిపించెనో..ఓ.. మరిపించినో.. ఆదమరిచే..ఏ..
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే..ఏ
మూగ మనసులే వెన్నెలనే కురింపించేనే..ఏ

అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా
ఓ రోజూపూవు మాలే తేరా
అహ నువు సై అంటే.. నీ తోడై ఉంటా
నీ కళ్లల్లోన.. నే కాపురముంటా

జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా..
జాంగు చక్కు చచక్కు చక్కు జాంగు చక్కు ఛా..

అరె చిలకమ్మా చిటికేయంట
నువు రాగాలే పాడాలంట
ఓ చిన్నోడా పందిరి వేయరా..ఊఁ.. ఆహహ..
ఓ రోజూపూవు మాలే తేరా
ఊఁ.. ఊఁ..
  

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.