శుక్రవారం, నవంబర్ 04, 2016

ఆరనీకుమా ఈ దీపం...

కార్తీక దీపం చిత్రం కోసం సత్యం గారు స్వరపరచిన ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కార్తీక దీపం (1979)
సంగీతం : సత్యం
సాహిత్యం : దేవులపల్లి
గానం : సుశీల, జానకి

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...
ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఇదే సుమా నా కుంకుమతిలకం
ఇదే సుమా నా మంగళసూత్రం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం..

ఇంటిలోన నా పాప రూపున గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళల కొండంతదీపం
ఇంటిలోన నా పాప రూపున గోరంతదీపం
కంటికెదురుగా కనబడువేళల కొండంతదీపం
నా మనస్సులో వెలిగే దీపం
నా మనుగడ నడిపే దీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

ఆకాశాన ఆ మణి దీపాలే ముత్తైదువులుంచారో
ఈ కోనేటా ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో
ఆకాశాన ఆ మణి దీపాలే ముత్తైదువులుంచారో
ఈ కోనేటా ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారో
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై యుండే
దేవికి పట్టిన హారతులే

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం

ఆ ఆ ఆ... ఆ ఆ ఆ...

నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
నా నోచిన నోములు పండెనని ఈ ఆనందదీపం
నా దాచిన కోర్కెలు నిండునని ఈ ఆశాదీపం
ఎటనైనా ఎప్పుడైనా నే కొలిచే కళ్యాణదీపం
నే వలచే నా ప్రాణదీపం

ఆరనీకుమా ఈ దీపం కార్తీకదీపం
చేరనీ నీ పాదపీఠం కర్పూరదీపం
చేరనీ నీ పాదపీఠం నా ప్రాణదీపం



0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.