శనివారం, నవంబర్ 26, 2016

లలిత కళారాధనలో...

కళ్యాణి చిత్రమ్ కోసం రమేష్ నాయుడు గారు స్వరపరచిన ఒక అద్భుతమైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : కళ్యాణి (1979)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ
లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ..ఊఊ
మధురభారతి పద సన్నిధిలో..ఓ..ఓ..
మధురభారతి పద సన్నిధిలో
ఒదిగే తొలిపువ్వును నేను ఊ..ఊ..
ఒదిగే తొలిపువ్వును..నేను..ఊ..
 
లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ

 
ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ
ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ
ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ
ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ

ఏ వెల ఆశించి పూచే పువ్వూ..
తావిని విరజిమ్మునూ..ఊ..ఊ..ఊ
ఏ వెల ఆశించి పూచే పువ్వూ..
తావిని విరజిమ్మునూ..ఊ..ఊ..ఊ
అవధిలేని ప్రతి అనుభూతికి..ఈ..ఈ..
అవధిలేని ప్రతి అనుభూతికి
ఆత్మానందమే..ఏ..ఏ..పరమార్థం

లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ

 
ఏ సిరి కోరి పోతన్నా..ఆ..
భాగవత సుధలు చిలికించెనూ..ఊ..ఊ..ఊ
ఏ సిరి కోరి పోతన్నా..ఆ..

భాగవత సుధలు చిలికించెనూ..ఊ..ఊ..ఊ
ఏ..నిధి కోరి త్యాగయ్యా..

రాగజల నిధులు పొంగించెనూ..ఊ..ఊ..ఊ
ఏ..నిధి కోరి త్యాగయ్యా..

రాగజల నిధులు పొంగించెనూ..ఊ..ఊ..ఊ
రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ
రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ
రసా..ఆ..నందమే పరమార్థం.

లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ..ఊఊ
మధురభారతి పదసన్నిధిలో..ఓ..ఓ..
మధురభారతి పదసన్నిధిలో
ఒదిగే తొలిపువ్వును నేను ఊ..ఊ..
ఒదిగే తొలిపువ్వును..ఊ..నేను
లలిత కళారాధనలో.. వెలిగే
చిరు దివ్వెను నేను..ఊ..ఊ

 

1 comments:

venu garu a r rahman songs post cheyandi please.......................................................................................................................................................

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail