సోమవారం, నవంబర్ 07, 2016

రెండై తిరిగే ఒకే ఓ రూపం...

బ్రదర్స్ చిత్రంలోని ఒక మంచి పాటను ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : బ్రదర్స్ (2012)
సంగీతం : హారిస్ జైరాజ్
సాహిత్యం : చంద్రబోస్
గానం : క్రిష్, ఎమ్.కె.బాలాజి, మిలి

రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా
ధీరె ధీరె ధీరె ధీరే
మేఘం నేను మెరుపే నువ్వు
నీకూ నాకూ నింగి ఒకటే

రెక్క కలిసే పక్షులం ఎగరేస్తాం అలజడిలో
రెమ్మ కలిసే పువ్వులం నవ్వేస్తాం అలసటలో

రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా

దివినుంచీ తొలివరమొచ్చీ
విరి కబురొచ్చి సిరి కలలొచ్చి
కలలకు ఆకృతి వచ్చీ
కనులిచ్చీ మరిచెవులిచ్చీ
చిరు ఎదలిచ్చీ ఇరు తలలిచ్చీ
అన్నింటిని కలిపే ఉంచీ
అటు నువ్వయ్యి ఇటు నేనయ్యి 
చెరి సగమయ్యి
కుడి ఎడమగ ఉన్నా
విడి పడ లేని యుగమయ్యి

రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా

తన మాటా ఒక చినుకంటా
ఇక మనమాట ఒక పెనుమంటా
మా మాటలు వేరేనంటా
తన బాటా నది నడకంటా
ఇక మన బాటా సుడి మునకంటా
మాబాటలు మావేనంటా
తను నాకందం నే తనకందం ఇది నిజమే
మరి ఒకరికి ఒకరం అర్ధం కానీ విధమే 

రెండై తిరిగే ఒకే ఓ రూపం
రెండై వెలిగే దీపం మేమంటా
రెండై పలికే ఒకే ఓ రాగం
ఒకటై నిలిచే ప్రాణం మేమంటా 
ధీరె ధీరె ధీరె ధీరే


0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.