శనివారం, నవంబర్ 19, 2016

గోరంత దీపము తుమ్మెదా...

అంకుశం చిత్రంలోని ఒక చక్కని పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అంకుశం (1990)
సంగీతం : సత్యం
సాహిత్యం : మల్లెమాల
గానం : జానకి

ఆఆఅ....హోయ్...
గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 
మెళ్ళోన ఏలాడు నల్ల పూసల తాడు 
ఇల్లాలికెలుగంట తుమ్మెదా 
ఇల్లాలికెలుగంటా తుమ్మెదా 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 

రామయ్య గుండెలో తుమ్మెదా 
సీతమ్మ కొలువంట తుమ్మెదా 
పరమశివుడొంటిలో తుమ్మెదా 
పార్వతే సగమంట తుమ్మెదా 
ఆళ్ళ పేర్లెట్టుకుని సిగ్గు శరమొగ్గేసి 
తిరిగేటి వాళ్ళను తిరగేసి మరగేసి 
ఉతికి ఆరేయ్యాలి తుమ్మెదా 
ఆళ్ళ ఊరెళ్ళగొట్టాలి తుమ్మెదా..

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 
మెళ్ళోన ఏలాడు నల్ల పూసల తాడు 
ఇల్లాలికెలుగంట తుమ్మెదా
ఇల్లాలికెలుగంట తుమ్మెదా 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 

గుళ్ళోని పూజారి తుమ్మెదా 
గుడినే మింగాడంట తుమ్మెదా 
పెళ్ళిళ్ళ పేరయ్యకు తుమ్మెదా 
పెళ్ళామే కరువంట తుమ్మెదా 
తాయారు కూతురు తానమాడుతుంటె 
ఎదురింటి ముసిలోడు ఎనకమాలే వచ్చి 
వీపు తట్టాడంట తుమ్మెదా 
ఆణ్ణి ఏంజేస్తే తప్పుంది తుమ్మెదా 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 
మెళ్ళోన ఏలాడు నల్ల పూసల తాడు 
ఇల్లాలికెలుగంట తుమ్మెదా
ఇల్లాలికెలుగంట తుమ్మెదా 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 

కట్టేది కాషాయ బట్టలు 
కోక కనిపిస్తే ఏసేది లొట్టలూ 
చెప్పేది శ్రీరంగ నీతులు 
అవ్వ దూరేది సీకటి గుడిసెలు
తాడిసెట్టెక్కింది దూడగడ్డికి 
అంటు బుంకరింపులతోటీ 
లోకాన్ని నమ్మించు ఎదవల్ని 
ఎతికెతికి తుమ్మెదా 
ఏరిపారేయ్యాలి తుమ్మెదా.. 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 
మెళ్ళోన ఏలాడు నల్ల పూసల తాడు 
ఇల్లాలికెలుగంట తుమ్మెదా
ఇల్లాలికెలుగంట తుమ్మెదా 

గోరంత దీపము తుమ్మెదా 
కొండకే ఎలుగంట తుమ్మెదా 
పచ్చా పచ్చని చేలు తుమ్మెదా 
పల్లెకే ఎలుగంట తుమ్మెదా 

 

2 comments:

ఎక్సెలెంట్ మూవీ..నైస్ సాంగ్..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.