బుధవారం, నవంబర్ 23, 2016

పాడనా వాణి కళ్యాణిగా...

బాలమురళీ కృష్ణ గారి గురించి నిన్న సాయంత్రం నుండీ వస్తున్న వార్తలను మనసు నమ్మనంటుంది. ఆ గళానికి ఆగిపోవడమన్నది తెలియదు. పృధ్వి ఉన్నంత వరకూ అమృతం నిండిన ఆ గళం రికార్డుల రూపంలో వినిపిస్తూనే ఉంటుంది. వారికి నివాళి అర్పిస్తూ మేఘసందేశంలోని పాట తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.చిత్రం : మేఘసందేశం (1982)
సంగీతం : రమేశ్ నాయుడు
సాహిత్యం : వేటూరి
గానం : బాలమురళీకృష్ణ

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..

గమదని సని పామా నిరిగమ రిగ నిరి స
మామాగా గాదప దపమ గానిద నిదప మాదని
సాని గారి సనిద పసాని దపమ
నిసని దపమ నిసని గమదని సని పామరిగా...

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా
ఆ.. ఆ..

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

తనువణువణువును తంబుర నాదము
నవనాడుల శృతి చేయగా ఆ....

గరిస్స నిదని మద నిదా నిదపద గమ సని దపమ

ఎద మృదంగమై తాళ లయగతులు 
గమకములకు జతగూడగా
అక్షర దీపారాధనలో 
స్వరలక్షణ హారతులీయగా
అక్షర దీపారాధనలో 
స్వరలక్షణ హారతులీయగా
తరంతరము నిరంతరము 
గానాభిషేకమొనరించి తరించగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా

స్వర ముఖరిత నిర్ఝరులు లహరులై 
దేవి పాదములు కడుగగా

గనిగరి రినిమగ రిగదమ గమనిద 
గనీరిద మ నిదామగ రి మగారి

లయ విచలిత గగనములు 
మేఘములై తానములే చేయించగా
సంగీతామృత సేవనలే 
నిజ సాహిత్యాభినివేశములై
సంగీతామృత సేవనలే 
నిజ సాహిత్యాభినివేశములై
తరంతరము నిరంతరము 
గీతాభిషేకమొనరించి తరించగ

పాడనా వాణి కళ్యాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
స్వరరాణి పాదాల పారాణిగా
పాడనా వాణి కళ్యాణిగా
నా పూజకూ శర్వాణిగా నా భాషకూ గీర్వాణిగా
శరీర పంజర స్వర ప్రపంచక మధురగాన సుఖవాణిగా
ఆ.. ఆ..

 

0 comments:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail