ఆదివారం, నవంబర్ 20, 2016

దీవాలీ దీపాన్ని...

దడ చిత్రంలోని ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట వీడియో ఇక్కడ చూడవచ్చు ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ అవ్వని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.



చిత్రం : దడ (2011)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : ఆండ్రియా, కళ్యాణ్

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని
ఒంటరి పిల్లోడ.. ఆలే
తుంటరి పిల్లోడా.. ఆలే
వద్దకు లాగెయ్‌రా.. ఆలే.. వజ్రాన్ని

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని

ఊరించే నిషాని ఊపిరిపోసే విషాన్ని
నెత్తురు లోతుకు
హత్తుకుపోయిన స్నేహాన్ని
అత్తరు పూసిన బాణాన్ని
అల్లాడిస్తా ప్రాణాన్ని
అల్లుకుపోరా కాముడు
రాసిన గ్రంథాన్ని

చక్కెర చిన్నోడ.. ఆలే
కత్తెర కళ్లోడా.. ఆలే
చూడర బుల్లోడా.. ఆలే.. అందాన్ని

కదిలే నావలా వయసే ఊయల
ఎదటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే
నిజమా ఈ కల అనిపించేంతలా
మనసే గువ్వలా గాల్లో తేలిందే
నీపక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా
నాకే నీలోన చోటిస్తే నన్నే దాచేస్తా
ఓ.. నీ గూడు నాకిస్తే ఇందా నా గుండె నీకిస్తా
నీతో వెయ్యేళ్లు రానిస్తే నన్నే రాసిస్తా

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

ఒకడే వేయిగా కదిలే మాయగా
కనిపించావుగా అటూ ఇటూ నా చుట్టూ
సలసల హాయిగా సరసున రాయికా
కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
పొందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో
ఎటో ఎత్తుకు పోతావో అంతా నీ ఇష్టం
ఉప్పెన తెస్తావో నొప్పిని ఉప్ఫనిపిస్తావో
తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం 

దీవాలీ దీపాన్ని సాంబ్రాణి ధూపాన్ని
నీ కళ్లలోన ఆకళ్లు పెంచే రూపాన్ని
బంధించే దారాన్ని
తీపనిపించే కారాన్ని
ఎన్నటికైనా నిన్నే కోరే నీదాన్ని

 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.