సోమవారం, నవంబర్ 28, 2016

తమాష దీపం నవీన దీపం...

అల్లాఉద్దీన్ అద్భుత దీపం చిత్రంలో ఒక హుషారైన పాట ఈ రోజు తలచుకుందాం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. ఎంబెడెడ్ వీడియో లోడ్ ఆవని వాళ్ళు ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : అల్లాఉద్దీన్ అద్భుత దీపం (1957)
సంగీతం : ఎస్.రాజేశ్వరరావు, హనుమంతరావ్
సాహిత్యం : ఆరుద్ర
గానం : పిఠాపురం

తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా
నిజంగా లభించు బేరం ఇదేకదా
ఆ లభించు బేరం ఇదే కదా

లోకమున చీకటులు మూసుకొను వేళలోన
దారులను చూపునది దీపాలే
చిన్నవారి చేతిలోన పెద్దవారి చేతిలోన
ఒకే వెలుగు వెలుగునవి దీపాలే
పాతదీపమిస్తే కొత్తదీపమిస్తాం
పాతదీపమిస్తే కొత్తదీపమిస్తాం
మోసమేమి లేదు లేదు
చూసుకోండి బాబయ్యా బాబయ్యా..

తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా
నిజంగా లభించు బేరం ఇదేకదా
ఆ లభించు బేరం ఇదే కదా

గొప్పోళ్ళ దీపమూ పేదోళ్ళ దీపము
చీకట్లు చీల్చేది ఒకమాదిరే
గొప్పోళ్ళ దీపమూ పేదోళ్ళ దీపము
చీకట్లు చీల్చేది ఒకమాదిరే
రాజాధిరాజుకు నిరుపేద వానికీ
ఆ వెలుతురే కాదా
తేడాలు ఏలరా బేధాలు లేవురా
దీపాలు జ్ఞానం భోధించురా
ఆ దీపాల కాంతిలో జీవించరా
దీపాలు జ్ఞానం భోధించురా
ఆ దీపాల కాంతిలో జీవించరా

తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా
నిజంగా లభించు బేరం ఇదేకదా
ఆ లభించు బేరం ఇదే కదా

ఒక్కొక్క దేహమూ ఒక్కొక్క దీపమూ
వెలిగించు వాడూ ఆ దేముడే 
ఒక్కొక్క దేహమూ ఒక్కొక్క దీపమూ
వెలిగించు వాడూ ఆ దేముడే 
ఏనాడు ఆరునో ఏలాగు మారునో
ఆ చేతిలో ఉంది
ఈ పాత దీపము నా కొత్త దీపమూ
మార్చేస్తే ఏమగునో యోచించరా
నీ చీకట్లు ఏమగునో యోచింఛరా
మార్చేస్తే ఏమగునో యోచించరా
నీ చీకట్లు ఏమగునో యోచింఛరా

అ తమాష దీపం నవీన దీపం బిరాన కావాలా
నిజంగా లభించు బేరం ఇదేకదా
ఆ లభించు బేరం ఇదే కదా 
 

0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.