శుక్రవారం, జులై 17, 2015

కొండగాలి తిరిగిందీ...

గోదావరిలో పడవ ప్రయాణం.. ఒడ్దున తుళ్ళుతూ పరుగులెత్తే ప్రేయసి.. ఆ ప్రియుడి మనసు మౌనంగా ఊరుకుంటుందా.. కోరిక వరద గోదారై ముంచేయదూ. అచ్చంగా మలయ మారుతంలా హాయిగా సాగే ఈ పాట విని పులకరించని మది ఉండదేమో. మీరూ ఆస్వాదించండి మరి. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఉయ్యాల జంపాల (1965)
సంగీతం : పెండ్యాల
సాహిత్యం : ఆరుద్ర
గానం : ఘంటసాల, సుశీల

కొండగాలి తిరిగిందీ......
కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..

పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికిందీ....
ఆ..ఆ..ఆ..
పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కులికింది
గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది
ఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడిందీ
ఆఆ..ఓఓ..ఆఆ..ఆ..
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది

కొండగాలి తిరిగిందీ ఆ.. గుండె వూసులాడింది
ఆ..ఆ..
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ
 
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ..ఈ..ఈ.
మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయింది
నాగమల్లి పూలతో నల్లని జెడ నవ్వింది
ఆ..ఆ..ఆ
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ఆ..ఆ ..ఆ..
పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
ఆ..ఆ..

కొండగాలి తిరిగిందీ గుండె వూసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది
ఆ..ఆ..ఆ..ఆ


7 comments:

this is a memorable song. Great music, singing and lyrics.

Hi Venu gaaru,

Mee blog ni kotha gaa follow avutunna. Very good curation of beautiful songs. One small request. Can you open a you tube channel and add all your songs there? In that way it would be easy for everybody to find the songs at one place and play them continously rather than playing one at a time in each blog post.

థాంక్స్ ఫస్ట్ అజ్ఞాత గారు.

థాంక్స్ సెకండ్ అజ్ఞాత గారూ మీ సజెషన్ బాగుందండీ.. త్వరలో తప్పకుండా క్రియేట్ చేస్తాను.

కార్తీక మాసపు చలిలో తెల్లవారు ఝాము స్నానాలు..పోటీపడి అలలపై వెలిగించిన ఆధ్యాత్మిక దీపాలు..అంతలోనే భక్తి తో నమస్కరిస్తూ..మరింతలోనే జలకాలాటలలో అని పాడుకుంటూ అల్లరి చేస్తూ..ఒకటా రెండా..ఇలా యెన్నో, యెన్నెన్నో ఊసులని మాతో పంచుకున్న గోదారమ్మ పాట..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారూ.. గోదారితో మీ అనుబంధాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు.

"తంతననంతన తాళంలో" పాట సాహిత్యం ఉందా మీ దగ్గిర?

ఉంది హరిబాబు గారు.. లింక్ ఇదిగోండి.. ఇక్కడ చూడవచ్చు.. http://sarigamalagalagalalu.blogspot.in/2014/10/blog-post_9.html

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.