శనివారం, జులై 25, 2015

ఉప్పొంగెలే గోదావరి / ఉప్పొంగి పోయింది...

గోదావరి గురించి గోదారి మీద సాగే లాంచీలో ప్రయాణం గురించి వేటూరి వారు ఎంతో అందంగా వర్ణించిన ఈ పాట నాకు చాలా ఇష్టం. నేటితో పుష్కరాలకు వీడ్కోలు చెబుతూ మళ్ళీ పుష్కరమెప్పుడొస్తుందా అని ఎదురు చూపులు మొదలు పెడుతూ ఈ పన్నెండు రోజులూ పుష్కర శోభతో ఉప్పొంగిపోయిన గోదారమ్మను చూసి ఈ అందమైన పాట పాడుకుందామా.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : వేటూరి
గానం : బాలు

షడ్జమాం భవతి వేదం
పంచమాం భవతి నాదం
శృతి శిఖరే నిగమ ఝరే స్వరలహరే

సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ద ప ప
సా స పా ప ప ప ప మ రి స స ని స
సా స పా ప ప ప ప మ ని ద ప

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి

సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయ్యంగానె లాభసాటి బేరం
ఇళ్ళే వోడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగే నీటి అద్దం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడ?
నది వూరేగింపులో పడవ మీద రాగా
ప్రభువు తాను కాదా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 
 
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దె మిరప ఎరుపు
లంకానాధుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతాకాంతకి
సందేహాల మబ్బే పట్టె చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఏకాంతాల వలపు
అల పాపి కొండలా నలుపు కడగలేక
నవ్వు తనకు రాగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి 
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి

ఏసెయ్ చాప జోర్సేయ్ నావ వార్సేయ్ వాలుగా
చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా

ఉప్పొంగెలే గోదావరీ ఊగిందిలే చేలో వరి
భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరీ

~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~

ఇదే చిత్రంలో టైటిల్స్ బ్యాక్ డ్రాప్ లో వినిపించే పాటగా అడవి బాపిరాజు గారు వ్రాసిన ఈ అందమైన పాటను ఉపయోగించుకున్నారు. ఇది నాకు చాలా ఇష్టమైన పాట. గోదావరి గురించి ఎంతో అందంగా వర్ణించిన పాట మీరూ విని ఆనందించండి. ఎంబెడ్ చేసినది చిత్రం మొదట్లో వచ్చే ఫిమేల్ వర్షన్, ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు. కె.ఎమ్.రాధాకృష్ణన్ పాడిన వర్షన్ ఇక్కడ చూడవచ్చు. అదే వర్షన్ ఆడియో ఇక్కడ వినవచ్చు లేదా డౌన్లోడ్ చేస్కోవచ్చు.
 

చిత్రం : గోదావరి (2006)
సంగీతం : కె.ఎం. రాధాకృష్ణన్
సాహిత్యం : అడివి బాపిరాజు
గానం : చిత్ర (?)

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

కొండల్లో ఉరికింది గోదావరి
తాను కోనల్లో నిండింది గోదావరి
కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది
ఆకాశ గంగతో హస్తాలు కలిపింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి

మడులలో సుడులలో గరువాల నడలలో
పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది
అడవి చెట్లన్నీని జడలోన తురిమింది
ఊళ్ళు దండలు గుచ్చి మెళ్ళోన దాల్చింది

ఉప్పొంగి పోయింది గోదావరి
తాను తెప్పున్న ఎగిసింది గోదావరి 
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలాల..లాలాలలాలాల..
లాలాలలాలా..లాఆ..ఆఅ..  

~*~*~*~*~*~

  సినిమాలో ఉపయోగించని చరణాలు ఇవి :

శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి
శంకరాభరణ రాగాలాప కంఠయై

॥ఉప్పొంగి॥

నరమానవుని పనులు సిరిమొగ్గి వణకాయి
కరమెత్తి దీవించి కడలికే నడిచింది

॥ఉప్పొంగి॥



2 comments:

వేటూరి వారి మాటల్లో హొయలు పోతూ, బాపిరాజుగారి అక్షరాలలో అల్లరి చేస్తున్న గోదారమ్మని మనసులో నింపుకుంటూ..మరల వచ్చే అంత్య పుష్కరాల కోసం యెదురుచూస్తున్నాము..

థాంక్స్ శాంతి గారు, నిజమండీ అంత్య పుష్కరాల కోసం ఎదురు చూపులు మొదలయ్యాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.