బుధవారం, జులై 29, 2015

పాపి కొండల వెనుక...

నమ్మిన వారికి రాతిలో దేవుడు కనిపిస్తాడు, ఉవ్వెత్తున అలలతో ఎగసి పడుతూ సుడిగుండాలతో ఉరకలు పరుగులు తీసే గోదావరి లోనూ సేదతీర్చే చల్లదనం ఉంది. అలాగే మనిషి మాట మొరటైనా మనసు చల్లనైనదయ్యే అవకాశాలు లేకపోలేదు అది చూడగలిగిన మనసుకే కనిపిస్తుంది. ఇదిగో ఈ అమ్మాయికి అలాంటి ఓ చల్లని మనసు కనిపించిదట ఆ వివరం మనమూ విందామా. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : ఆడాళ్ళు మీకు జోహార్లు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : ఆచార్య ఆత్రేయ
గానం : సుశీల

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లీ ఉన్నాడనీ..ఈఈ..
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయేనే

పాపి కొండల వెనుక
పాపంటి మనసున్న
జాబిల్లీ ఉన్నాడననీ..
చల్లని కబురొచ్చెనే..
నా జంకంతా విడిపోయెనే


చీకటి కడుపులో పుట్టాడనీ..
వెలుగొచ్చి చీకటినే చంపాడనీ..
చీకటి కడుపులో పుట్టాడనీ...
వెలుగొచ్చి చీకటినే చంపాడనీ...
మాయని మత్తొకటి కలవాడని
మగువుల పాలిటి పగవాడని
మాయని మత్తొకటి కలవాడని
మగువుల పాలిటి పగవాడని
నిలకడే లేదని నిందలే వింటినీ..
విన్నది కల్లాయనే..
తెలి వెన్నెల జల్లాయనే...

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లి ఉన్నాడనీ...
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే


గోదారి గోలనే వింటారూ.ఊఊ..
గుండెలో చలవెవరు చూస్తారూ.ఊఊ..
గోదారి గోలనే వింటారూ...
గుండెలో చలవెవరు చూస్తారూ...
కోకిలకు కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే
కోకిలకి కాకికి గూడొక్కటే
తేడాలు తెలిపేది గొంతొక్కటే
నమ్మితే దేవుడు రాతిలో ఉన్నాడు
కాకుల లోకానికి...
నువ్వు కోకిల కావాలిలే...

పాపికొండల వెనుక..
పాపంటి మనసున్న
జాబిల్లి ఉన్నాడనీ.. ఈ ఈ ఈ....
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే
చల్లని కబురొచ్చెనే...
నా జంకంతా విడిపోయెనే.. 

 

2 comments:

కోపం తో దహించినా..ప్రేమతో సహించినా ఆడదానికే చెల్లు..వరద గోదారంటి ఓ అమ్మాయి గుండె చప్పుడే ఈ పాట..

సూపర్ బాగా చెప్పారు శాంతి గారూ :-) థాంక్స్ ఫర్ ద కామెంట్.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.