బుధవారం, జులై 01, 2015

వేవేలా వర్ణాలా...

నాసిక్ పుట్టినిల్లుగా కొవ్వూరు మెట్టినిల్లుగా మనకై శివ కరుణతో భూమిపైకి జాల్వారిన అద్భుతం మన గోదావరి.. పాయలుగా కరిగి, ప్రవాహంగా కదిలిపోతూ తీరాన ఉన్న ప్రతి అణువుకీ పచ్చదనాన్ని అద్దే అన్నపూర్ణ మన గోదావరి.. ఒద్దికగా ఒంపులు తిరుగుతూ శాంతి శాంతిగా ప్రవహించే రుక్మిణంటి మన గోదావరి.. అడిగిన వారికి లేదనక పవిత్రతని ప్రసాదిస్తున్నట్టి మన అఖండ గోదావరికి పుష్కరాలు.. అదీ 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే అద్భుత ఘడియలలో పుష్కరాలు.. అందుకే ఈ నెల రోజులూ ఆ అమ్మ ఒడిలో సేద దీరుదాం.. అమృతమంటి ఆ నీటి ఒరవడిలోని ప్రతి బిందువునీ మన పాటలలో ఆస్వాదిద్దాం...
 
గోదావరిని ప్రకృతి తో పోలుస్తూ సాగే ఈ సిరివెన్నెల రచనను ముందుగా విందాం. ఈ పాటకు ఇళయరాజా గారి స్వర రచన అద్భుతం. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు. అలాగే జూలై 14 నుండి 25 వరకూ సాగే పుష్కరాల గురించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించిన "గోదావరి పుష్కరాల సంక్షిప్త పరిచయం" e-బుక్ ఇక్కడ చూడవచ్చు.


చిత్రం : సంకీర్తన
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : సిరివెన్నెల
గానం : బాలూ, కౌసల్య (సీనియర్ లీడ్ కోరస్ సింగర్)

ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
ఆ..ఆ..ఆ..అ..అ..ఆ..
వేవేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతాలై...

వేవేలా వర్ణాలా... ఈ నేలా కావ్యాలా...

ఓ గంగమ్మో పొద్దెక్కి పోతాంది తొరగా రాయే...
ఓ...తల్లీ గోదారి తుళ్ళి తుళ్ళి పారేటి
పల్లె పల్లె పచ్చాని పందిరీ...పల్లె పల్లె పచ్చాని పందిరీ...
నిండూ నూరేళ్ళు పండు ముత్తైదువల్లె వుండు
పంటా లచ్చిమి సందడీ...పంట పంటా లచ్చిమి సందడీ...
తందైన..తందతైన..తందైన..తందతైన..
తందైన..తందతయ్యనా.. తయ్య..తందైన..తందతయ్యనా..

వాన వేలి తోటీ నేల వీణ మీటే...
నీలి నింగి పాటే.. ఈ చేలటా...
కాళిదాసు లాటి.. తోట రాసుకున్న..
కమ్మనైన కవితలే ఈ పూలటా...
ప్రతి కదలికలో నాట్యమె కాదా..
ప్రతి ఋతువూ ఒక చిత్రమె కాదా..
ఎదకే కనులుంటే....

వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
అలలూ శిలలూ తెలిపే కధలూ...
పలికే నాలో గీతా లై...
వే వేలా వర్ణాలా...ఈ నేలా కావ్యాలా...
లాలలా...ఆ అ ఆ...
లాలలా...ఆ అ ఆ...





2 comments:

హాయ్..మా గోదారిని ఈ నెల రోజులూ మీరూ దత్తత తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉండండి..ఆ పవిత్ర జలాల్లో మూడు స్నానాలు చేస్తే యెంతో పుణ్యమట..మరి మీరు 30 రోజులూ మునకలు వేయిస్తానన్నారు..మరెంత పుణ్యమో కదూ..

థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు... దత్తత అంత పెద్దమాటలెందుకులెండి కానీ మీరన్నట్లు ముప్పై రోజులపాటు మునకలేద్దామని ఆలోచనండీ :-)

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పోస్ట్ కంటెంట్ తో సంబంధంలేని మరియూ బ్లాగ్ అగ్రిగేటర్స్ ని స్పామ్ చేసే ప్రమోషనల్ కామెంట్స్ పబ్లిష్ చేయబడవు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.