సోమవారం, జులై 27, 2015

పున్నమి లాగా వచ్చి పొమ్మని...

పన్నెండేళ్ళకొక్క మారే వచ్చినా ఆ పుష్కరంకోసం గోదారమ్మ, ఆమెతో పాటు ఆమె ఒడిన సేద తీరుతున్న ప్రజలు ఎంతగా ఎదురు చూస్తారో తెలియనిది కాదు కదా. అలాగే ఈ కుర్రాడు తెలుగుదనానికి దూరమై పాశ్చాత్య పోకడలు పోతున్న తన నెచ్చెలి తిరిగి పదారణాల తెలుగమ్మాయిలా తనదరికి రావాలని ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడో వేటూరి వారి తేటతెనుగు మాటల్లో మీరే వినండి.. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.


చిత్రం : జడగంటలు (1984)
సంగీతం : పుహళేంది
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, సుశీల

ఆఆఆఆఆ..ఆఅహాహాఅ...లలలలలలాలాలా
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా
జడ గంటమ్మా రతనాలమ్మా జానకమ్మా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది

లలలలలలాలాలా లాలాలా....
పాపికొండలా పండువెన్నెలా పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
పాపికొండలా పండువెన్నెలా పక పక నవ్వాలా
వెండి గిన్నెలో పాలబువ్వలా రెల్లే నవ్వాలా
నీ మువ్వలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే
నీ మువ్వలు కవ్విస్తుంటే ఆ సవ్వడి సై అంటుంటే
సెలయేరమ్మా గోదారమ్మా చేతులు కలపాలా
చేతులు విడిచిన చెలిమిని తలచి 
కుంగిపోవాలా నే కుంగిపోవాలా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది

లలలలలలాలాలా...లలలాలాలా...
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
పల్లెపట్టునా పాలపిట్టలే శకునం పలకాలా
గోవు పొదుగునా పాలవెల్లులే పొంగులు వారాలా
జడగంటలు మనసిస్తుంటే గుడిగంటలు మంత్రిస్తుంటే
జడగంటలు మనసిస్తుంటే గుడిగంటలు మంత్రిస్తుంటే
నింగీ నేలా కొంగులు రెండూ ముడివడిపోవాలా
ముడివిడిపోయిన ముద్దుని తలచి 
కుంగిపోవాలా నే కుంగిపోవాలా

పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది
నువ్వు రావాలా పువ్వు పూయాలా రావేలా
జడ గంటమ్మా రతనాలమ్మా జానకమ్మా
ఆఆఆఅ..ఆఆఅ...ఆఆఆ
పున్నమి లాగా వచ్చి పొమ్మని జాబిల్లడిగింది
పుష్కరమల్లే వచ్చి పొమ్మని గోదారడిగింది


5 comments:

ఈ పాట ఇంతకుముందే షేర్ చేసినట్లున్నారు కదా ? నాకు చాలా ఇష్టం,మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.నాగమల్లివో తీగమల్లివో నీవే రాజకుమారి...ఈ పాట ఏ సినిమాలోది? గుర్తుకురావడం లేదు,అది కూడా ఇష్టమైన పాట.

Thanks for Ur Lyrics , Check and Download Any Song Here Telugu mp3 songs

లేదు నీహారిక గారు. ఈ పాట నేను షేర్ చేయడం ఇదే మొదటిసారి. మీరు అడిగిన పాట నాగమల్లి సినిమాలోనిదండీ. ఆ పాట ఆల్రెడీ షేర్ చేశాను. http://sarigamalagalagalalu.blogspot.in/2014/04/blog-post_29.html

ఆడపిల్ల జడగంటలు విసురుగా గుండెని తాకినా, పూల చెండుతో కొట్టినట్టే ఉంటుందట అబ్బాయిలకి..ఈ సీక్రెట్ తెలిస్తే జడంటే మర్చిపోయిన ఈ కాలం అమ్మాయిలు మళ్ళీ జడకుప్పెలనిష్ట పడతారేమో..

హహహ అంతే కదండీ మరి ప్రేమలో అన్నీ అపురూపమే :-) థాంక్స్ ఫర్ ద కామెంట్ శాంతి గారు..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

SPAM కామెంట్స్ ని కంట్రోల్ చేయడానికి పాతటపాలకు కామెంట్ మోడరేషన్ ఎనేబుల్ చేయబడినది. మీరు కామెంట్ రాసే టపా రెండువారాల లోపు ప్రచురించినది కాకపోతే మీకామెంట్ పోస్ట్ లో కనపడటానికి సమయం పట్టవచ్చు. మీ సహనానికి సహకారానికి దన్యవాదాలు.

నేను ??

నా ఫోటో
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, India
అర్ధంకానివాళ్ళకో ప్రశ్నార్థకం, అర్ధమైన వాళ్ళకో అనుబంధం. ఈ లోకంలో ఎందరో పిచ్చాళ్ళున్నారు. డబ్బు, పదవి, కీర్తి, కాంత, కనకం, ప్రేమ, సినిమా, మంచితనం, తిండి ఇలా ఎవరికి తోచిన పిచ్చిలో వాళ్ళు మునిగి తేలుతుంటారు. నేనూ ఓ పిచ్చోడ్నే.
TwitterFacebookGoogle PlusLinkedInRSS FeedEmail